ANR : ముఖ్యమంత్రిని కూడా అవతలికి పొమ్మన్న ఏఎన్నార్.. ఎన్టీఆర్ మీద అంత కోపం ఉండేదా ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

ANR : ముఖ్యమంత్రిని కూడా అవతలికి పొమ్మన్న ఏఎన్నార్.. ఎన్టీఆర్ మీద అంత కోపం ఉండేదా ?

 Authored By prabhas | The Telugu News | Updated on :18 November 2022,7:00 pm

ANR  : పౌరాణిక సినిమాలంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నందమూరి తారక రామారావు. రాముడైనా, రావణుడైన నటించి మెప్పించగల సత్తా ఆయనకే ఉంది. ఒకపక్క కమర్షియల్ గా సినిమాలు చేస్తూనే మరోపక్క పౌరాణిక సినిమాలను చేస్తుండేవారు. అందులో భాగంగా వచ్చిన సినిమా దానవీరశూరకర్ణ. ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూడవచ్చు. ఈ సినిమా పూర్తిగా ఎన్టీఆర్ శ్రమ వల్లనే విజయం అయిందని చెప్పవచ్చు. అప్పటి సినీ రంగంలో తిరుగులేని హీరోగా ఎంతో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమాను స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించి

అంతేకాకుండా కర్ణుడిగా దుర్యోధనుడిగా కృష్ణుడు పాత్రలలో నటించారు. అయితే ఈ సినిమాలో ముందుగా కృష్ణుడి పాత్రలో అక్కినేని నాగేశ్వరరావుని నటించమని ఎన్టీఆర్ అడిగారట. అయితే దానవీరశూరకర్ణ సినిమాలు నటించడానికి ఏఎన్ఆర్ సున్నితంగా తిరస్కరించారట. అందువల్ల అన్నగారే ఈ సినిమాలో కూడా కృష్ణుడి వేషం వేశారు. ఎన్టీఆర్ ను కృష్ణుడిగా చూసిన కళ్ళతో తనను జనం చూడలేరని అలాగే తాను కర్ణుడిగా నటిస్తే పాండవులు మరుగుజ్జులుగా కనిపిస్తారని అక్కినేని నాగేశ్వరావు సున్నితంగా చేయను అని చెప్పారట. దీంతో ఎన్టీఆర్ ఊరుకోలేదు.

ANR so angry with NTR who has seen the Chief Minister as well

ANR so angry with NTR who has seen the Chief Minister as well

మర్నాడు అక్కినేనిని అప్పటి ఏపీ సీఎం జలగం వెంగళరావు నుంచి పిలుపు వచ్చింది. మీరిద్దరూ కలిసి నటిస్తే జనం తప్పకుండా ఆదరిస్తారు ఒప్పుకోండి అన్నారట జలగం. దీంతో నాగేశ్వరరావు ఎన్టీఆర్కు చెప్పిన సమాధానమే జలగం వెంగళరావు కు చెప్పి అతి కష్టం మీద ఆ సినిమా నుంచి తప్పించుకున్నారట. ఆ సినిమా తర్వాత కూడా ఎన్టీఆర్ పట్టు విడవలేదు. తన తర్వాతి సినిమాలో ఏఎన్ఆర్ ను చాణక్యుడి పాత్రలో చూపించి తన మాట నెగ్గించుకున్నాడు. ఆ సినిమా పేరే చాణక్యచంద్రగుప్త. ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చూసిన ప్రేక్షకులు ఎంతో సంతోషించారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది