Keerthy Suresh : కీర్తి సురేష్‌కి చేత కానిది అనుప‌మ చేసి చూపించిందా.. ఇక తిరుగులేన‌ట్లేనా? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Keerthy Suresh : కీర్తి సురేష్‌కి చేత కానిది అనుప‌మ చేసి చూపించిందా.. ఇక తిరుగులేన‌ట్లేనా?

Keerthy Suresh : మ‌హాన‌టి సినిమాతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కాస్తా ట్రెడిషనల్, పద్ధతిగా కనిపిస్తూ తన మార్క్ చూపించేది. తను సినిమాల్లోనూ ఎక్కడా గ్లామర్ షోలేకుండానే అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం సిచ్యూయేషన్ మారడంతో గ్లామర్ షోలోనూ కీర్తి అదరగొడుతోంది. ట్రెండీ వేర్స్ లో అందాలు ఆరబోస్తూ కొంతకాలంగా కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఇలా రూటు మార్చడంతో కీర్తి సురేష్ లోని […]

 Authored By sandeep | The Telugu News | Updated on :30 August 2022,7:00 pm

Keerthy Suresh : మ‌హాన‌టి సినిమాతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందిన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కాస్తా ట్రెడిషనల్, పద్ధతిగా కనిపిస్తూ తన మార్క్ చూపించేది. తను సినిమాల్లోనూ ఎక్కడా గ్లామర్ షోలేకుండానే అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం సిచ్యూయేషన్ మారడంతో గ్లామర్ షోలోనూ కీర్తి అదరగొడుతోంది. ట్రెండీ వేర్స్ లో అందాలు ఆరబోస్తూ కొంతకాలంగా కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. ఇలా రూటు మార్చడంతో కీర్తి సురేష్ లోని కొత్త కోణం షాకింగ్ గా ఉంది. ఏకంగా బోల్డ్ ఫొటోషూట్లకు కూడా సై అంటోంది. ఈ మ‌ల‌యాళ బ్యూటీ ఎన్ని ప్ర‌యత్నాలు చేసిన కూడా పెద్ద‌గా పేరు ప్ర‌ఖ్యాత‌లు పొంద‌లేక‌పోతుంది.

Keerthy Suresh : కీర్తి సురేష్ కి కాలేదు….

అయితే మ‌రో మ‌ల‌యాళీ భామ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఒక్క దెబ్బ‌కు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ద‌క్కించుకుంది. మొన్నటి వరకు అనుపమా పరమేశ్వరన్‌ కెరీర్‌ కూడా తెలుగులో అయిపోయిందనుకున్నారు. చాలా వార్తలు వినిపించాయి. సోషల్‌ మీడియాలో అనేక పోస్టులు కూడా వచ్చాయి. కానీ దాన్ని ఒక్క సినిమా బ్రేక్‌ చేసింది. `కార్తికేయ 2` అనుపమాకి ఊహించిన బూస్ట్ ఇచ్చింది. పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు తీసుకురావడం విశేషం. మరో రెండుమూడేళ్ల వరకు అనుపమాకి తిరుగులేదని చెప్పొచ్చు. కీర్తి సురేష్ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీ నుండి వ‌చ్చి టాలీవుడ్ ని ఏలుతుంద‌ని అంద‌రు భావించారు. కాని ఇప్పుడు అనుప‌మ ఆ స్థానాన్ని ఆక్ర‌మించ‌నుంద‌ని అంటున్నారు.

anupama gives a shok to keerthy suresh

anupama gives a shok to keerthy suresh

`ప్రేమమ్‌` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్‌. ముగ్గురు హీరోయిన్లలో టీనేజ్‌ బ్యూటీ అదరగొట్టింది. దీంతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దోచేసింది. ఆ తర్వాత `శతమానం భవతి` చిత్రంతో మరో సక్సెస్‌ని అందుకుంది. శర్వానంద్‌తో కలిసి నటించింది. ఈ చిత్రం తెలుగు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డుని అందుకోవడం విశేషం. ఇటీవ‌ల అనుప‌మ లిప్ లాక్ సీన్స్‌లోను రెచ్చిపోయింది. చూస్తుంటే ఈ అమ్మ‌డు రానున్న రోజుల‌లో మ‌రింత చెల‌రేగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది