Anushka Sharma : అనుష్క శర్మ ప్రెగ్నెంటా.. త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారా..
Anushka Sharma: విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే అనుష్క శర్మ..’రబ్ దే బనా ది జోడీ’ అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఆమె.. ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఫలితంగా వరుస ఆఫర్లు దక్కించుకుంది. అలా చాలా కాలం హిట్లను కొట్టేసి ఆమె స్టార్‌డమ్‌ను సంపాదించుకుంది.
కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంది. అనుష్క శర్మ, కూతురు వామికాతో కలిసి విరాట్ వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్ళాడు. అక్కడ చాలా రోజులు ఎంజాయ్ చేసిన కోహ్లీ దంపతులు సోమవారం (జూన్ 13)న తిరిగి వచ్చారు. ముంబైలోని విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం విరుష్క జోడి కనిపించింది. విమానాశ్రయం నుంచి బయటికి వచ్చాక కెమెరాకు పోజులిచ్చారు. అయితే వెకేషన్ నుంచి తిరిగి వచ్చిన కొద్ది గంటల్లోనే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ హాస్పిటల్‌కు వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. సోమవారం సాయంత్రం ముంబైలోని కోకిలా బెన్ అంబానీ హాస్పిటల్ వద్ద విరుష్క జోడి కన్పించారు.
Anushka Sharma : గుడ్ న్యూస్ రానుందా?
వీరిద్దరూ కారులో హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఓ ఫోటోగ్రాఫర్ వీడియో తీశాడు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు ఊరుకుంటారా?.. ‘అనుష్క శర్మ మళ్లీ ప్రెగ్నెంట్’. ‘అనుష్క మరోసారి గుడ్ న్యూస్ చెప్పనుందా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తాము హాస్పిటల్‌కు వెళ్లిన రీజన్ గురించి మాత్రం వెల్లడించలేదు. ఓ షాంపూ యాడ్ కోసం కలిసిన కోహ్లీ, అనుష్క.. ప్రేమలో పడి వివాహ బంధంతో ఒకటైన విషయం తెలిసిందే. వీరికి 2021 జనవరిలో వామికా జన్మించింది.