Samantha : స‌మంత కోసం అనుష్క అంత ప‌ని చేసిందా.. అస‌లు విష‌యం ఏంటంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : స‌మంత కోసం అనుష్క అంత ప‌ని చేసిందా.. అస‌లు విష‌యం ఏంటంటే..!

 Authored By sandeep | The Telugu News | Updated on :11 July 2022,8:00 pm

Samantha : ఒక‌ప్పుడు అందాల ముద్దుగుమ్మ అనుష్క స్టార్ హీరోల‌కు సైతం పోటీనిచ్చేది. అనుష్క సినిమాలంటే ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉండేవి. నిశ్శబ్దం తర్వాత మళ్ళీ బిగ్ స్క్రీన్‌పై కనిపించనే లేదు. ఆ మధ్య యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో అనుష్క నటిస్తుందని ప్రకటించారు. ఇందులో యువ నటుడు నవీన్ పొలిశెట్టి కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే, అధికారికంగా ఈ ప్రాజెక్ట్ లాంచ్ అయినా కూడా ఇప్పటివరకు షూటింగ్ మొదలవలేదు. ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. క్లారిటీ ఇచ్చేసింది..

తాజాగా అనుష్క‌కి సంబంధించిన ఒక వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. స్టార్ హీరోయిన్ సమంత తో కలిసి అనుష్క స్క్రీన్ షేర్ చేసుకుందని ఇప్పటికే, ఇద్దరు షూటింగ్ కూడా కంప్లీట్ చేశారని ప్రచారం జరుగుతోంది. వివరాల‌లోకి వెళితే వైవధ్య‌మైన సినిమాలు తెర‌కెక్కించే గుణ‌శేఖ‌ర్.. ఇటీవ‌ల సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం అనే సినిమా రూపొందించాడు. పౌరాణిక గాథ ఆధారంగా ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో, అల్లు అర్హ మొదటిసారి చైల్డ్ ఆర్టిస్టుగా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

Anushka Shetty not acted in samantha movie

Anushka Shetty not acted in samantha movie

అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క నటించిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై నీలిమ గుణ క్లారిటీ ఇచ్చారు. అనుష్క మాకు సపోర్ట్ చేస్తున్నదుకు థాంక్స్. అయితే..ఆమె ఈ సినిమాలో నటించలేదు. కానీ, మాతోనే ఉంటూ మాకు తన సహాయాన్ని అందిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. దీంతో శాకుంతలం సినిమాలో సమంతతో పాటు అనుష్క నటిస్తుందనే వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. కాగా, గుణ శేఖర్ దర్శకత్వంలో అనుష్క రుద్రమదేవి సినిమా చేసిన సంగతి తెలిసిందే. అనుష్క‌, స‌మంత క‌లిసి ప‌ని చేస్తే చూడాల‌ని ఎప్ప‌టినుండో క‌ల‌లు కంటున్నారు అభిమానులు. వారి క‌ల ఎప్పుడు నిజం అవుతుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది