Anushka Shetty : అనుష్క పోస్టర్‌తో 40 యాక్సిడెంట్స్ జరిగాయా?
Anushka Shetty : 2005లో సూపర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన అనుష్క గ్లామరస్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోల పక్కన నటిస్తూనే లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసింది. అరుంధతి, రుద్రమ దేవి, భాగమతి, సైజ్ జీరో, నిశ్శబ్ధం తదితర లేడీ ఓరియంటెడ్ మూవీస్ అనుష్కకి మంచి పేరు తీసుకొచ్చాయి. అనుష్క త్వరలో మరో లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ తో మన ముందుకు రానుంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో అనుష్క నటించిన ఘాటి త్వరలోనే థియేటర్లలోకి రానుంది.
Anushka Shetty : అనుష్క పోస్టర్‌తో 40 యాక్సిడెంట్స్ జరిగాయా?
అనుష్క ఎన్ని సినిమాలైనా చేసి ఉండచ్చుగాక.. ఆమె కెరీర్ లో బాగా గుర్తుండిపోయే సినిమాల్లో వేదం ఒకటి. ఇందులో ఆమె వేశ్య పాత్ర వేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. వేదం సినిమా సమయంలో ఒక ఆసక్తికర సంఘటన జరిగింది. వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకొని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ని ప్రమోషన్స్ కోసం బాగా వాడారు. హైదరాబాద్ లోని చాలా చోట్ల అనుష్క ఫొటోని హోర్డింగ్ గా పెట్టారట.
పంజాగుట్ట సర్కిల్ లో కూడా అనుష్క వెనక్కి తిరిగి చూస్తున్న ఫొటోని పెద్ద హోర్డింగ్ గా పెట్టడంతో చాలా యాక్సిడెంట్స్ జరిగాయట. పోస్టర్‌ని చూస్తూ డ్రైవ్ చేయడం వలన దాదాపు 40 యాక్సిడెంట్స్ జరిగాయట. ఈ విషయాన్ని దర్శకుడు క్రిష్ చెప్పుకొచ్చాడు. వేదం సినిమా 15 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా తాను ఈ విషయాన్ని తెలియజేశాడు. అయితే రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ జరుగుతుండడాన్ని గమనించిన పోలీసులు GHMC అధికారులతో కలిసి అనుష్క హోర్డింగ్ ని తొలగించారట.
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
Andhra Pradesh : ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాయిటర్స్…
Smart Watch : సాధారణంగా చాలామంది చేతిని అందంగా కనిపించేందుకు స్మార్ట్ వాచ్ ని స్టైల్ కోసం, ఇంకా అవసరాల…
Vastu Tips : చాలామందికి తెలియకుండానే కొన్ని తప్పుల్ని ఇంట్లో చేస్తూ ఉంటారు. అలాగే వాస్తు విషయంలో కూడా అలాగే…
kingdom Movie Review : విజయ్ దేవరకొండ Vijay Devarakonda , Bhagya Sri Borse , హీరోగా నటించిన…
Pumpkin : గుమ్మడికాయలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో మూడు రకాల గుమ్మడికాయలు ఉంటాయి. మూడింటిలో ఆకుపచ్చ పసుపు తెలుపు…
Kingdom Movie Review : విజయ్ దేవరకొండ vijay devarakonda , bhagya sri borse నటించిన కింగ్డమ్ చిత్రం…
This website uses cookies.