Moive Tickets : అంతమంది సూపర్‌ స్టార్స్ వెళ్లినా ఈగో చల్లారలేదా.. టికెట్ల పెంపు జీవో ఎక్కడ?

Authored By Himanshi | The Telugu News | Published on: February 14, 2022, 9:30 pm

Moive Tickets : సినిమా టికెట్ల రేట్లు విషయం లో టాలీవుడ్ ప్రముఖులు ఆ మద్య అమరావతి వెళ్లి పలు దఫాలుగా ఏపీ ప్రభుత్వం తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయినా కూడా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఎట్టకేలకు చిరంజీవితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ ఇంకా మరి కొందరు స్టార్స్ వెళ్లడం తో జగన్ ప్రభుత్వం కాస్త నానబడినట్లుగా అనిపించింది.. అతి త్వరలోనే టికెట్ల రేట్లు పెరుగుతాయి అంటూ ప్రచారం జరిగింది. అతి త్వరలోనే టికెట్ల రేట్లు పెంపు సంబంధించిన జీవో రాబోతుంది అంటూ టాలీవుడ్ వర్గాల వారు చంకలు గుద్దుకుని వారి సంబరపడ్డారు కానీ పరిస్థితులు చూస్తుంటే జీవో రావడానికి మరి కొన్నాళ్లు సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రభుత్వం తలుచుకుంటే రాత్రికి రాత్రే జీవోలు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. గతం లో ఎన్నో జీవోలను రాత్రికి రాత్రి ప్రభుత్వాలు ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ టికెట్ల కు సంబంధించిన జీవో ను మాత్రం విడుదల చేయడానికి సమయం కావాలంటూ ప్రభుత్వం కోరడం విడ్డూరంగా ఉంది. రేట్ల విషయంలో ఇప్పటికే ఏర్పడిన సంఘం నివేదిక ఇవ్వడం తో పాటు ఇండస్ట్రీ పెద్దలు కొంత మంది టికెట్ల విషయంలో విజ్ఞప్తులు చేయడం జరిగింది. ఇవన్నీ జరిగిన కూడా ప్రభుత్వం నుండి ఇంకా కాస్త బెట్టు కనిపిస్తుంది.సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలని టాలీవుడ్ ప్రముఖుల నుంచి అమరావతికి పిలిపించుకున్నాడు అనే వార్తలు వచ్చాయి.

ap government tickets rates not increase yet

ap government tickets rates not increase yet

ఈ సమయంలో ఆయన ఈగో చల్లారింది కనుక ఇక టిక్కెట్ల రేట్ల పెంపు కచ్చితం అంటూ అంతా నమ్మకంతో ఉన్న సమయంలో మరో అనుమానం మొదలైంది. ఇంకా జీవో విడుదల ఆలస్యం అవుతున్న నేపథ్యంలో జగన్ ఇగో ఇంకా చల్లారలేదా అంటూ కొందరు గుసగుసలు పెడుతున్నారు. టికెట్ల రేట్ల పెంపు విషయమై ఏపీ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు నిర్ణయం తీసుకుంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో జగన్ నుండి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆవేదనతో ఉన్నారు. ఈ విషయమై చిరంజీవి మళ్ళీ ఏదైనా మాట్లాడతాడేమో చూడాలి.

Also read

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp