Nayanthara : నయనతార పిల్లల విషయంలో అసలు నిజం బయటపెట్టిన కోర్టు.. ఆ పిల్లలు పుట్టింది వీళ్లకే
Nayanthara : పెళ్లి కాకముందు వరకూ నయనతార జీవితం చాలా హ్యాపీగా సాగిపోయింది. ఎప్పుడైతే విఘ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి తనకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అయితే.. తన లైఫ్ లో తనే ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుందని తన అభిమానులు అంటున్నారు. ఎందుకంటే.. తను ఒకప్పుడు సౌత్ ఇండియా సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఒక స్టార్ హీరోకు కూడా లేనంత క్రేజ్ తనకు అప్పట్లో ఉండేది. కానీ.. ఏ ముహూర్తాన విఘ్నేశ్ ను పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి తనకు కష్టాలు ప్రారంభం అయ్యాయనే చెప్పుకోవాలి.
పెళ్లి ఫోటోల విషయంలో స్టార్ట్ అయిన సమస్య.. చివరకు వాళ్ల ఇద్దరు కవలల విషయంలోనూ కంటిన్యూ అయ్యాయి. పెళ్లి వేడుకను నెట్ ఫ్లిక్స్ కు బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ ఇచ్చిన నయనతార.. తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై నెట్ ఫ్లిక్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత తిరుమలలో చెప్పులు వేసుకోవడం కూడా తనకు మరో సమస్యను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఇప్పుడు సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చారు అనేది మరో వార్త. ఇండియాలో సరోగసి పద్ధతిని బ్యాన్ చేశారు. అయినా కూడా ఈ ప్రాసెస్ ద్వారా ఎలా నయనతార, విఘ్నేశ్ శివన్ ఎలా పిల్లలను కన్నారు అంటూ జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు..

are the twins of nayanthara original babies of her and vignesh
Nayanthara : సరోగసీ బ్యాన్ అయినా ఎలా వీళ్లు పిల్లలను కన్నారు అంటూ ఫైర్
తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ జంటపై యాక్షన్ తీసుకోవడానికి రెడీ అవుతోందట. ఈనేపథ్యంలో వీళ్లపై కేసు పడుతుందని గ్రహించి వెంటనే నయన్ విఘ్నేశ్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. తమకు ఆరేళ్ల క్రితమే పెళ్లి అయిందని దానికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ ను కూడా తమిళనాడు ప్రభుత్వానికి అందించారట. అయితే.. సరోగసి ప్రాసెస్ ద్వారా పిల్లలను కనాలంటే కనీసం పెళ్లి అయిన ఐదేళ్లు అవ్వాలి. భార్య లేదా భర్తకు పిల్లలు పుట్టని సమస్య ఉండాలి. అప్పుడే సరోగసీ పద్ధతి ద్వారా పిల్లలను కనొచ్చు. దీన్ని పట్టుకొని తమకు ఆరేళ్ల ముందే పెళ్లయిందని, నయనతారకు పిల్లలు పుట్టే అవకాశం లేదని చెబుతూ విన్నవించుకున్నారట. దీంతో నయన్, విఘ్నేశ్ ఈ సమస్య నుంచి బయటపడినట్టే ఇక. అంటే.. ఇక ఆ కవల పిల్లలు నయన్, విఘ్నేశ్ సొంతం అయినట్టే ఇక.