Bigg Boss Telugu OTT : దేశ వ్యాప్తంగా ఉన్న బుల్లితెర ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచుతున్న షో బిగ్ బాస్. బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా రూపొందిన దీనిని మొదటిగా 2006లో హిందీలో ప్రారంభించారు. ఏమాత్రం అంచనాలు లేకుండా మొదలైనప్పటికీ.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకుని సక్సెస్ అయింది. అందుకే ఏకంగా ఈ షో ఇప్పుడు అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకోగా, త్వరలో ఓటీటీ షో కూడా మొదలు పెట్టబోతున్నారు. . దీన్ని కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయనున్నాడు.బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను 2021లో హిందీ నిర్వహకులు ప్రసారం చేశారు. అక్కడ ఇది సూపర్ హిట్ అయింది.
దీంతో ఇప్పుడు తెలుగులోకి కూడా తీసుకుని వస్తున్నారు. అయితే, దీన్ని బిగ్ బాస్ సీజన్ మాదిరిగా టీవీలో చూపించరు. కేవలం ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ప్రసారం చేస్తారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు ఈ షోను స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలిసిందే. ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా రోజుల క్రితమే దీనికి సంబంధించిన అన్ని పనులనూ ప్రారంభించారు. సెట్ వర్క్‌ను దాదాపుగా కంప్లీట్ చేసేశారని అంటున్నారు.మొత్తం 82 రోజుల పాటు ఓటీటీ సీజన్ సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు.
ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందని తెలిసింది. ఈ లిస్ట్‌లో అరియానా పేరు కూడా ఉన్నట్టు సమాచారం. అప్పుడు మిస్ చేసుకున్న కప్‌ని ఈ సారి ఎలా అయిన సాధించాలనే కసితో అరియానా ఉందట. అరియానాతో పాటు మాజీ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో ఆదర్శ్, తనీష్, అఖిల్, అలీ రెజా, హరితేజ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక కొత్త వారిలో యాంకర్ వర్షిణి, యాంకర్ శివ, ‘ఢీ-10’ విజేత రాజు, టిక్‌టాక్ స్టార్ దుర్గారావు, ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్స్’వెబ్ సిరీస్ ఫేమ్ వైష్ణవి, సోషల్ మీడియా స్టార్ వరంగల్ వందన, యాకర్ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.