Surekha Vani : రోజంతా నిద్ర లేదు ఒకటే పని.. సురేఖా వాణి పోస్ట్ వైరల్

Authored By Cinema Desk | The Telugu News | Updated on: October 10, 2021, 10:04 am

Surekha Vani : సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె షూటింగ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. మొన్నీ మధ్యే సురేఖా వాణి చెన్నైకి వెళ్లింది. అక్కడి తమిళ సినిమా షూటింగ్‌లో సురేఖా వాణి పాల్గొంది. అర్దరాత్రి వరకు షూటింగ్ జరిగింది. అలా నిన్న అంతా కూడా షూటింగ్‌లతోనే గడిపింది. అర్దరాత్రి దాటి, తెల్లవారుఝాము వరకు సెట్‌లో సురేఖా వాణి గడిపింది. అర్దరాత్రి నడి రోడ్డు మీద షూటింగ్‌లు జరిగినట్టు చెప్పింది.

Artist Surekha vani Leaves Chennai For MAA Elections

Artist Surekha vani Leaves Chennai For MAA Elections

అయితే అలా అంత బిజీగా ఉన్నా కూడా ఎంతో రెస్ట్ తీసుకోవాలని అనిపించిందట. ఆదివారం కాబట్టి రెస్ట్ దొరుకుతుంది.అక్కడే చెన్నైలోనే ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు. కానీ హైద్రాబాద్‌కు సురేఖా వాణి బయల్దేరింది. అలా రావడానికి కూడా కారణం ఉంది. నేడు మా ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే తన బాధ్యతగా ఓటు వేసేందుకు హైద్రాబాద్‌కు రాబోతోన్నానని సురేఖా వాణి చెప్పుకొచ్చింది.

మా ఎన్నికల కోసం సురేఖా వాణి :

Artist Surekha vani Leaves Chennai For MAA Elections

Artist Surekha vani Leaves Chennai For MAA Elections

ఈ మేరకు ఫ్లైట్‌లో సురేఖా వాణి హైద్రాబాద్‌కు ప్రయాణమైంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రోజంతా నిద్రలేదు.. షూటింగ్‌తోనే సరిపోయింది. రెస్ట్ తీసుకోవాలి.. పడుకోవాలని ఉంది.. కానీ హైద్రాబాద్‌కు వస్తున్నాను.. మా ఎన్నికల్లో ఓటింగ్ చేయాలి.. అది నా బాధ్యత అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఇందులో ఎవరు గెలుస్తారో చూడాలి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp