Surekha Vani : చాలా రోజుల తరువాత ఆ పని చేశా.. అర్దరాత్రి సురేఖా వాణి రచ్చ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Surekha Vani : చాలా రోజుల తరువాత ఆ పని చేశా.. అర్దరాత్రి సురేఖా వాణి రచ్చ

 Authored By bkalyan | The Telugu News | Updated on :20 October 2021,3:40 pm

Surekha Vani : తెరపై కంటే సోషల్ మీడియాలోనే సురేఖా వాణి ఎక్కువగా హల్చల్ చేస్తోంది. ఈ మధ్య సురేఖా వాణికి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ కరోనా, లాక్డౌన్ సమయంలో అంతా సోషల్ మీడియాలోనే బతికేశారు. ఇక సెలెబ్రిటీలు అయితే నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లోనే ఉంటూ వచ్చారు. అలా సురేఖా వాణి ఈ ఏడాదిన్ననర కాలంలో సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. తన కూతురు సుప్రితతో కలిసి సోషల్ మీడియాను ఊపేస్తోంది.

Artist Surekha Vani Mid Night Car Ride

Artist Surekha Vani Mid Night Car Ride

సుప్రిత, సురేఖా వాణి ఇద్దరూ కలిసి చేసే రచ్చకు జనాలు అవాక్కవుతుంటారు. తల్లీకూతుళ్లు కలిసి తిరిగే తిరుగుళ్లు.. పబ్బులు, పార్టీలు అంటూ చేసే హంగామా, గోవా సముద్ర తీరంలో ఈ ఇద్దరూ చేసే రచ్చ మామూలుగా ఉండదు. అలా ఈ ఇద్దరూ కలిసి ఫ్రెండ్స్‌లా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సుప్రిత ఫ్రెండ్స్ గ్యాంగుతో సురేఖా వాణి కూడా వెకేషన్లకు వెళ్తూ ఉంటుంది. అలా సురేఖా వాణి ఇప్పుడు చాలా రోజుల తరువాత ఓ పని చేసిందట.

Surekha Vani నైట్ రైడ్‌తో సురేఖా వాణి రచ్చ

surekha vani

surekha vani

అర్దరాత్రి ఇలా లాంగ్ డ్రైవ్,నైట్ రైడ్ చేసి చాలా రోజులైందని చెప్పుకొచ్చింది. అర్దరాత్రి హైద్రాబాద్ రోడ్డుపై నైట్ రైడ్ చేసింది. కారులో అలా చక్కర్లు కొట్టేసింది. కారులో సురేఖా వాణితో పాటు సుప్రిత కూడా ఉన్నట్టు అనిపిస్తోంది. మొన్నీమధ్యే వచ్చిన విజయ్ సేతుపతి, తాప్సీ అనబెల్ల సేతుపతి సినిమాలో సురేఖా వాణి నటించింది. ఇక ఇప్పుడు మళ్లీ తమిళ, తెలుగు ద్విభాష చిత్రంలోనూ సురేఖా వాణి నటిస్తోంది. గతం వారం షూటింగ్ కోసం చెన్నైకి వెళ్లి వచ్చింది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది