Supritha : సింగిల్ అంటున్న సుప్రిత‌.. అత‌ను ఓకే అంటే క‌మిటవుతానంటూ స్ట‌న్నింగ్ కామెంట్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Supritha : సింగిల్ అంటున్న సుప్రిత‌.. అత‌ను ఓకే అంటే క‌మిటవుతానంటూ స్ట‌న్నింగ్ కామెంట్..!

Supritha : అందంతో పాటు అభినయంలో హీరోయిన్‌ని మించిపోయింది సుప్రిత‌. సురేఖా వాణి కూతురిగా కాకుండా త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న‌ప్ప‌టి నుండే యాక్టింగ్ అంటే మక్కువ చూపించే సుప్రిత 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ మొద‌లు పెట్టింది. ఇందులో ఓ రేంజ్‌లో మెప్పించిన ఈ కుర్రది.. తర్వాత ‘అవర్స్ వర్సెస్ అదర్స్’, ‘వెళ్లిపో’, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లు చేసింది. ఇవన్నీ సూపర్ హిట్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :27 April 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •   సింగిల్ అంటున్న సుప్రిత‌.. అత‌ను ఓకే అంటే క‌మిటవుతానంటూ స్ట‌న్నింగ్ కామెంట్

Supritha : అందంతో పాటు అభినయంలో హీరోయిన్‌ని మించిపోయింది సుప్రిత‌. సురేఖా వాణి కూతురిగా కాకుండా త‌న‌కంటూ ప్ర‌త్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చిన్న‌ప్ప‌టి నుండే యాక్టింగ్ అంటే మక్కువ చూపించే సుప్రిత 2019లో ‘మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్’ అనే షార్ట్ ఫిల్మ్‌తో కెరీర్ మొద‌లు పెట్టింది. ఇందులో ఓ రేంజ్‌లో మెప్పించిన ఈ కుర్రది.. తర్వాత ‘అవర్స్ వర్సెస్ అదర్స్’, ‘వెళ్లిపో’, ‘గాయత్రి పోతే పోవే’ అనే కవర్ సాంగ్‌లు చేసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు ఎనలేని గుర్తింపును, క్రేజ్‌ను అందించాయి. అయితే హీరోయిన్ మెటీరియల్‌గా కనిపించే సుప్రితను సినిమాల్లోకి తీసుకు రావాలని సురేఖ వాణి ఎప్పటి నుంచో ప్రయత్నిస్తుండ‌గా,అది ఇప్ప‌టికీ సాధ్య‌మైంది.

Supritha  : సుప్రిత మాములు స్పీడ్ లేదు..

సుప్రిత హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సినిమా ఇప్పుడు షూటింగ్ జ‌రుపుకుంటుంది. అమర్‌దీప్ చౌదరి హీరోగా చేస్తున్నాడు.సుప్రీత కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. బోల్డ్ గా రచ్చ చేస్తుంది. గ్లామర్‌ ఫోటో షూట్లతో తెగ ర‌చ్చ చేస్తుంటుంది. తల్లీకూతుళ్లు చేసే యాక్టివిటీస్‌ చాలా వరకు ట్రోల్స్ కి కారణమవుతుంటుంది. ఇక ఇదిలా ఉంటే సుప్రీత .. లేటెస్ట్ గా ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది.. ఆమె స్టార్‌ సింగర్‌పై క్ర‌ష్ ఉంద‌నే స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ఈ విషయాన్ని యాంకర్‌ రీతూ చౌదరి వెల్లడించడం విశేషం. రీతూ చౌద‌రి హోస్ట్‌గా దావ‌త్ అనే షోర‌న్ అవుతున్న విష‌యం తెలిసిందే. సెలబ్రిటీలు ఇందులో పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.

Supritha సింగిల్ అంటున్న సుప్రిత‌ అత‌ను ఓకే అంటే క‌మిటవుతానంటూ స్ట‌న్నింగ్ కామెంట్

Supritha : సింగిల్ అంటున్న సుప్రిత‌.. అత‌ను ఓకే అంటే క‌మిటవుతానంటూ స్ట‌న్నింగ్ కామెంట్..!

అందులో భాగంగా లేటెస్ట్ ఎపిసోడ్‌లో సింగర్‌ శ్రీరామ చంద్ర పాల్గొన్నారు. ఇంతలో యాంకర్‌ రీతూ చౌదరి.. ఆయనపై ఇద్దరు భామలు క్రష్‌ పెంచుకున్నారని తెలిపింది. ఎవరు అని అడగ్గా, కుషిత అని చెప్పింది. ఎలాంటి అబ్బాయి కావాలని అడిగితే.. శ్రీరామ చంద్ర లాంటి అబ్బాయి కావాలని, ఆయన మొగుడిలా అనిపిస్తాడు అని కుషిత చెప్ప‌డంతో శ్రీరామ చంద్ర మీసాలు తిప్పుతూ రెచ్చిపోయాడు. ఇక సుప్రీత కూడా మీరంటే క్ర‌ష్ అని తెలిపింది.. దావత్‌ షోకి శ్రీరామ చంద్ర‌ వస్తున్నాడని ఆమెతో చెబితే.. ఏ అడుగు నేను సింగిలే, ఆయన సింగిలా కాదా అని అడగమని చెప్పిందట సుప్రీత. దీనికి నవ్వులు పూయించిన శ్రీరామ చంద్ర, తాను సింగిలే అని, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు అని చెప్పుకొచ్చాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది