Ashu Reddy : అషూ రెడ్డి తండ్రి మామూలోడు కాదు .. కూతురుతోనే మందు కొట్టించి .. వామ్మో !

Advertisement

Ashu Reddy : బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది హాట్ బ్యూటీ అషూ రెడ్డి. ఈ షోతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతేకాకుండా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో పవన్ అభిమానుల నుండి మరింత సపోర్ట్ ఏర్పడింది. ఈమె గతంలో బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తో చేసినా రచ్చ అంత ఇంతా కాదు. అంతేకాకుండా వీళ్లిద్దరి మధ్య ప్రేమ కూడా ఉందని అప్పట్లో పుకార్లు వినిపించాయి. బుల్లితెరపై ప్రసారమైన కామెడీ స్టార్ అనే కామెడీ షో తో లేడీ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

Ashu Reddy father gift to his daughter
Ashu Reddy father gift to his daughter

ఆ షోలో కూడా మరో కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరితో బాగా రెచ్చిపోయింది. ఏకంగా అతడికి ముద్దులు పెట్టి, హగ్గులు ఇచ్చి షోను హైలెట్ చేసింది. ఆ తర్వాత యాంకర్ రవితో కలిసి షోలో బాగా రెచ్చిపోయింది. ఇక సోషల్ మీడియాలో ఈమె ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా నెటిజన్స్ చేసే దారుణమైన కామెంట్లు కూడా ఎదుర్కొంటుంది. ఇక యూట్యూబ్ ఛానల్ లో సొంతంగా ఛానల్ పెట్టి వీడియోస్ పంచుకుంటూ ఉంటుంది.

Advertisement

 Ashu Reddy Rushes With The Bottle Of Medicine Sent By His Father Will He Give T-TeluguStop.com

అయితే తాజాగా అషూ రెడ్డి తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఓ స్టోరీని పంచుకుంది. అందులో తన తండ్రి తనకోసం మ్యాన్షన్ హౌస్ మందు బాటిల్ పంపాడని, ఆ ఫోటోను షేర్ చేస్తూ తనకు తానే తండ్రి పంపాడని సంతోష పడిపోయింది. కానీ తన తండ్రి పంపించిన గిఫ్ట్ తన తల్లికి నచ్చలేదు అని చెప్పుకొచ్చింది. దీంతో ఈ ఫోటో చూసినా అందరూ కూతురుకి ఇలాంటి గిఫ్ట్ కూడా పంపిస్తారా అని ఆశ్చర్యపోతున్నారు. అలాగే నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అషూ రెడ్డి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

Advertisement
Advertisement