Ashu Reddy : జీవితంలో అదే పెద్ద దెబ్బ.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిన అషూ రెడ్డి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ashu Reddy : జీవితంలో అదే పెద్ద దెబ్బ.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిన అషూ రెడ్డి

 Authored By bkalyan | The Telugu News | Updated on :21 August 2021,5:30 pm

Ashu Reddy : అషూ రెడ్డి సోషల్ మీడియాలో ఎంతటి కాంట్రవర్సీలకు దారి తీస్తుందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ అభిమాని అయిన అషూ రెడ్డి.. Ashu Reddy ఆయన పేరు మీదే ఎక్కువగా ట్రోలింగ్‌కు గురైంది. ఆయన పేరును పచ్చబొట్టుగా పర్సనల్ ప్లేస్‌లో పొడిపించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఏకంగా పవన్ కళ్యాణ్‌కు నాల్గో భార్యగా ఉంటానని ఓ నెటిజన్ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది అషూ రెడ్డి. దీంతో నెట్టింట్లోఅషూ పేరు మార్మోగిపోయింది.

Ashu Reddy On Her Relationship And Friends

Ashu Reddy On Her Relationship And Friends

అలా పవన్ కళ్యాణ్ వ్యవహారం, రాహుల్ సిప్లిగంజ్‌తో రిలేషన్, కామెడీ స్టార్స్‌లో హరితో చేసే స్కిట్లు, ఇప్పుడు వర్మతో చేయబోతోన్న ఇంటర్వ్యూ ఇలా ప్రతీ దాంట్లో అషూ రెడ్డి వైరల్ అవుతూనే వస్తోంది. తాజాగా అషూ రెడ్డి తన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లిపోయింది. అసలే అషూ రెడ్డి గతం ఎంత ఘోరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. లవ్ ఫెయిల్యూర్ వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లింది.

Ashu Reddy On Her Relationship And Friends

Ashu Reddy On Her Relationship And Friends

Ashu Reddy : జీవితంలో అదే పెద్ద దెబ్బ.. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిన అషూ రెడ్డి

తాజాగా అషూ తన గతం గురించి, అందులో స్నేహితుల గురించి చెప్పుకొచ్చింది. కొందరు స్నేహితులు మన ఎదుగుదల చూసి మన మీదే ఈర్ష్యపడతారు.. వారు ఇడియట్స్ అని ఓ కొటేషన్‌ను అషూ షేర్ చేసింది. అవును నా జీవితంలోనూ అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు.. వారుచేసినవి నాకు ఎంతో గట్టిగా తగిలాయి.. ఇంకా మరిచిపోలేదు.. అంటూ అషూ తెలిపింది.

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది