Ashu Reddy : రోడ్లు ఊడ్చే పని మొదలు పెట్టిన బుల్లితెర నటి అషు రెడ్డి

Authored By Himanshi | The Telugu News | Updated on : 3 February 2022, 2:30 pm

Ashu Reddy : ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా సెలబ్రిటీలు చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. ఇందుకలను అందు లేను అన్న సందేహం వలదు అన్నట్లుగా రకరకాల ఫీట్లతో నెటిజెన్స్ ను ఆకట్టుకునేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఫోటో షూట్ లు మరియు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యేందుకు వారు చేస్తున్న పనులు కొన్ని సార్లు విడ్డూరంగా అనిపిస్తున్నాయి. తాజాగా అషు రెడ్డి చేసిన పని మరి రచ్చ అంటూ నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం రోడ్డు మీద ఊడ్చే వాళ్ళ పక్కన కూర్చొని.. వారి పొరక పట్టుకుని రోడ్డు ఊడ్చి మరి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఆమె ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కోసం రోడ్డు ను ఊడ్చే వారిని ఫాలో అవడం ఏంటి అంటూ కొందరు నేటి జెంట్స్ విమర్శిస్తుంటే మరి కొందరు మాత్రం ఆమె క్రియేటివిటీకి జోహార్ అంటూ కామెడీగా కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి క్రియేటివిటీని ముందు ముందు చూపించకు తల్లి నీకు దండం అంటూ మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. రోడ్లు ఊడ్చే పని చేయడం ద్వారా సమాజానికి మంచి జరుగుతుందని.. మీరు ఆ పని చేయడం మంచిదే అని, వారంలో రెండు మూడు రోజులు అలా చేస్తే మీకు మరియు సమాజానికి మంచి జరుగుతుంది కనుక మీరు దీన్ని కంటిన్యూ చేయవచ్చు అంటూ మరి కొందరు సరదా కామెంట్స్ చేశారు.కొందరు ఈ ఫొటోలను కూడా వావ్‌ హాట్‌ అషు అంటూ కామెంట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తానికి ఆశు రెడ్డి ఫోటోలు హాట్ గా ఉన్నా.. ఇలా రోడ్లు ఊడుస్తున్న ఉన్నా వైరల్ అవుతున్నాయి.కనుక ఆమె హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజన్స్‌ కామెంట్ చేస్తున్నారు.

Ashu Reddy on Road Cleaning Social Comments

Ashu Reddy on Road Cleaning Social Comments

కచ్చితంగా ముందు ముందు హీరోయిన్‌ గా సినిమాల్లో నటించాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు. బిగ్ బాస్ షో తర్వాత ఆమెకి ఒక్కసారిగా పేరు దక్కింది. ఒకప్పుడు సమంత మాదిరిగా ఉంది అంటూ కామెంట్ దక్కించుకున్నా ఇప్పుడు మాత్రం ఆమె డూప్ గా కూడా లేదు అనే వారు ఉన్నారు. బుల్లి తెర మరియు సోషల్ మీడియా మీద తెగ సందడి చేస్తున్న ఈ అమ్మడు త్వరలోనే కచ్చితంగా వెండి తెర పై కూడా సందడి చేసే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సిని వర్గాల వారు కూడా అషు రెడ్డి చేస్తున్న వ్యవహారాలను ఫొటోస్ ను చూస్తూ ఉంటారు కనుక కచ్చితంగా సినిమాల్లో ఈమెకు అవకాశాలు ఇస్తారని భావిస్తున్నారు, ఏం జరుగుతుందో వేచి చూద్దాం.

Himanshi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp