Ashu Reddy : దరిద్రం మొహం.. యాంకర్ రవి పరువుతీసిన అషూ రెడ్డి
యాంకర్ రవి అషూ రెడ్డిల మధ్య ఓ కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య ఓసారి అషూ రెడ్డిని యాంకర్ రవి మోసం చేసిన సంగతి తెలిసిందే. నడుచుకుంటూ వస్తున్న అషూ వీడియోకి అడవి పంది అంటూ ఓవార్తను చదువుతున్న మాటలను ఎడిట్ చేశాడు. అప్పటి నుంచి యాంకర్ రవి ఎప్పుడు దొరుకుతాడా? అని అషూ రెడ్డి ఎదురుచూస్తుంది.
అయితే మొత్తానికి రవి దొరికేశాడు. ఈ ఇద్దరూ ప్రస్తుతం హ్యాపీ డేస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ మధ్య రవి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో ఆ షో మూలకు పడింది. మళ్లీ ఇప్పుడు రవి, అషూ రెడ్డి కలిసి ఆ షోను నడిపిస్తున్నారు. అయితే ఈ షో షూటింగ్ సెట్‌లో రవి దొరికాడు. రవి అలా ఖాళీగా కూర్చుని ముచ్చట్లు పెడుతున్న వీడియోను అషూ తీసింది.

Ashu Reddy Shares Anchor Ravi Video From Happy days Set
Ashu Reddy : రవి వీడియోపై అషూ రెడ్డి కామెంట్..
దానికి సునీల్ కామెడీ డైలాగ్ అయిన దరిద్రం మొహమా? అంటూ ఓ రీల్ వీడియోను యాడ్ చేసింది. దొరికేశావ్ అంటూ సంబరపడుతున్నట్టుగా రవి వీడియోను అషూ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక దీనికి రవి స్పందిస్తూ.. నువ్ దొరకవా? అంటూ మరో రివేంజ్‌కు తెరదీశాడు. అయిత ఈ సారి అషూ రెడ్డిని ఇంకెంత వింతగా చూపిస్తాడో మరి. మొత్తానికి ఈ వీడియో మాత్రం వైరల్ అవుతోంది.
View this post on Instagram