Bigg Boss 5 Telugu : జెస్సీ ఫైటర్.. అది ఎప్పటికీ జరగదన్న అషూ రెడ్డి
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో ప్రతీ సీజన్‌లో అనారోగ్యం పాలైన ఓ కంటెస్టెంట్ బయటకు రావడం ఆనవాయితీగా మారింది. నూతన్ నాయుడు అలానే ఓ టాస్క్‌లో గాయపడి బయటకు వచ్చేశాడు. ఇక నాల్గో సీజన్‌లో అయితే నోయల్, గంగవ్వ ఇద్దరూ కూడా ఆరోగ్యం సహకరించక బయటకు వెళ్లారు. బిగ్ బాసే వాళ్లను బయటకు పంపించేస్తాడు. మీ ఆరోగ్యం క్షిణించింది.. ఇక్కడ చికిత్స కంటే బయటకు వెళ్తేనే క్షేమమంటూ బిగ్ బాస్ వారిని బయటకు పంపించేస్తాడు.

Ashu Reddy Supports Jessie In Bigg Boss 5 Telugu
అలానే నిన్నటి ఎపిసోడ్‌లో జెస్సీని కూడా బయటకు పంపంచేశాడు. అసలే గత వారం నుంచి జెస్సీ ఆరోగ్యం బాగా ఉండటం లేదు. కంటికి సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్నాడు. అయినా కూడా టాస్కుల్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు. తన వల్ల అయిందంతా చేస్తున్నాడు. కానీ బిగ్ బాస్ ఇంట్లో జెస్సీ ఆరోగ్యం మాత్రం కుదుట పడటం లేదు. అందుకే నిన్న జెస్సీని బయటకు పంపించేశారు. బయట ట్రీట్ మెంట్ ఇప్పించారట.
Bigg Boss 5 Telugu : జెస్సీకి మద్దతుగా అషూ రెడ్డి

Ashu Reddy Supports Jessie In Bigg Boss 5 Telugu
కానీ మరీ అంత సీరియస్ ఏమీ లేదని డాక్టర్లు చెప్పడంతో సీక్రెట్ రూంలో పడేశారు. క్వారంటైన్‌లో భాగంగానే జెస్సీని ఇప్పుడు సీక్రెట్ రూంలో పెట్టేశారు. జెస్సీని ఎలిమినేట్ చేసేస్తారనే రూమర్లు బయటకు వచ్చాయి. అయితే దీనిపై అతని అభిమానులు కాస్త హర్ట్ అయినట్టున్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి జెస్సీని తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దానిపై అషూ రెడ్డి స్పందించింది. జెస్సీ ఓ ఫైటర్.. అతను ఇప్పుడప్పుడే బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రాడు అని అషూ రెడ్డి చెప్పుకొచ్చింది.