Rahul Sipligunj | రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిది పెద్ద బ్యాక్‌గ్రౌండే..వివరాలు ఏంటి?
Rahul Sipligunj | సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బిగ్ బాస్ కు వెళ్లి.. విన్నర్ గా గెలిచి మరింతమంది అభిమానులను గెలుచుకున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ పాడి ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకొని పాన్ ఇండియా లెవెల్లో అదరగొట్టాడు. ఇక ఆగస్టు 17 న సింపుల్ గా ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.
Rahul Sipligunj : సైలెంట్‌గా నిశ్చితార్థం జరుపుకున్న రాహుల్ సిప్లిగంజ్.. ఫొటోలు వైరల్
అమ్మాయి ఎవరంటే..
దీంతో రాహుల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు.. ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి.. ? అని పలువురు అభిమానులు ఆరాలు తీస్తున్నారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి పేరు హరిణ్య రెడ్డి అని, టీడీపీ సీనియర్ నేత, నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (NUDA) ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కూతురని తెలిసింది..
2020 లో రాహుల్, హరిణ్యల మధ్య పరిచయం ఏర్పడింది. ఐదేళ్లుగా ఈ జంట ప్రేమించుకుంటున్నారు. హరిణ్య బిగ్ బాస్ నిర్వహించే ఎండేమోల్ షైన్ కంపెనీకి ప్రొడ్యూసర్ గా పనిచేసింది. ప్రస్తుతం ఆమె ఓకే పెద్ద కంపెనీలో పనిచేస్తుందని టాక్. ఇక హరిణ్య కుటుం బం మొత్తం నందమూరి బాలకృష్ణకు దగ్గర సన్నిహితులు అని అంటున్నారు. ప్రస్తుతం రాహుల్, హరిణ్య ఎంగేజ్‌మెంట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.