Ashu Reddy : హీరోయిన్‌గా అషూ రెడ్డి.. ‘ఫోకస్’ అంటూ బిగ్ బాస్ బ్యూటీ హల్చల్

 Authored By prabhas | The Telugu News | Updated on :26 December 2021,7:00 pm

Ashu Reddy : బిగ్ బాస్ బ్యూటీ అషూ రెడ్డి హీరోయిన్‌గా మారనుంది. విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోన్న విజయ్‌ శంకర్‌‌తో అషూ రెడ్డి కలిసి నటిస్తోంది. స్కైరా క్రియేషన్స్‌ సమర్పణలో రిలాక్స్‌ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్‌’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ క‌న్ఫ‌ర్మ్ చేశారు. ఉత్కంఠ‌భ‌రిత‌మైన స్క్రీన్‌ ప్లేతో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా జి. సూర్యతేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఆసక్తికరమైన మలుపులతో ప్రేక్షకులను ఆద్యంతం ఆశ్చర్యపరిచే సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘ఫోకస్‌’ మూవీ తెరకెక్కుతోంది. ప్ర‌ముఖ న‌టి సుహాసిని మ‌ణిర‌త్నం కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన అషూరెడ్డి హీరోయిన్‌గా న‌టిస్తోంది. విజయ్‌ శంకర్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తుండగా సుహాసిని మణిరత్నం జడ్జ్‌ పాత్రలో నటిస్తున్నారు.

Ashu Reddy With Vijay Shankar In Focus Movie

Ashu Reddy With Vijay Shankar In Focus Movie

Ashu Reddy : వెండితెరపై అషూ హల్చల్

మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి..కానీ మా ఫోకస్‌ చిత్రం వాటంన్నింటికి విభిన్నమైంది. మర్డర్‌ మిస్టరీ అండ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు మా చిత్రం కొత్త తరహా అనుభూతిని ఇస్తుంది. సినిమాను గురించిన మరిన్ని విశేషాలు, వివరాలను త్వరలో వెల్లడిస్తామని చిత్ర ద‌ర్శ‌కుడు సూర్య‌తేజ తెలిపారు. మొత్తానికి అషూ రెడ్డి తొలిసారిగా ఇలా హీరోయిన్‌గా ఓ సినిమాలో కనిపించబోతోంది.

Ashu Reddy With Vijay Shankar In Focus Movie

Ashu Reddy With Vijay Shankar In Focus Movie

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి