Prabahs : సమంతకు, ప్రభాస్‌కి పెళ్లి అనేది అచ్చి రాదు అంటూ జ్యోతిష్కుడి కామెంట్స్
Prabahs : సినీ సెలబ్రిటీల జాతకం చెప్పే జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సమంత, నాగ చైతన్య విడిపోతారని ముందుగానే చెప్పి ఫేమస్ అయ్యారు. జ్యోతిష్యుడు వేణు స్వామి చెప్పే జ్యోతిష్యం ఎక్కువ వివాదాస్పదంగా ఉంటుంది. ఆయన జాతకం ప్రకారం వైవాహిక జీవితంలో లేడీ సూపర్ స్టార్ నయనతార, జేజమ్మ అనుష్క, నేషనల్ క్రష్ రష్మిక మందన్న విజయం సాధించలేరని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నలుగురు పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని, సక్సెస్ అవ్వలేరని పేర్కోన్నారు. నయనతారకు అసలు పెళ్లి అనేదే అచ్చి రాదని తెలిపారు వేణు స్వామి.
ఫెయిల్యూర్ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఉన్నారని వేణు స్వామి చెప్పారు. ఒకవేళ ఈ హీరోయిన్లకి వివాహం అయినా సరే ఫెయిల్యూర్ జాబితాలో వీళ్ళు ఉంటారని వేణు స్వామి చెప్పడం జరిగింది.ప్రభాస్, నయనతార, అనుష్క, రష్మిక మందన్నాల జాతకాల్లో గురువు నీచం లో ఉన్నట్లు తెలిపారు. సమంత జాతకంలో చూసుకున్నట్లయితే గురువు నీచంలో వున్నాడని వేణు స్వామి అన్నారు. అయితే ఎప్పుడైతే కుజుడు కానీ గురువు కానీ నీచంలో వున్నారు అంటే అప్పుడు వాళ్ళ సంసార జీవితం అంత బాగా ఉండదని తెలిపారు. నయనతార పెళ్లి గురించి మాట్లాడుతూ ఆమెకు పెళ్లి జరిగితే ప్రమాదం అంటూ పేర్కోన్నారు.

Astrologer Comments on prabhas Samantha
Prabahs : సంచలన కామెంట్స్..
చివరగా మాట్లాడుతూ సమంత, పూజా హెగ్డే, రష్మిక మందన్న, నయనతార కెరీర్ 2024 ముగిసిపోతుందని తెలిపారు.2024 వరకే వారికి హీరోయిన్ అవకాశాలు వస్తాయని, ఇక ఆ తర్వాత కొత్త హీరోయిన్స్, కొత్త బ్యాచ్ వస్తుందని తెలిపారు . కొద్ది రోజుల క్రితం వేణు స్వామి.. టాలీవుడ్‌లో మంచి జాతకం ఉన్న హీరో అల్లు అర్జున్ అని చెప్పిన విషయం తెలిసిందే. రాబోయే ఐదేళ్లలో ఆయన జాతకంలో ఎలాంటి మార్పులుండవు. ఆయన తీసే సినిమాలు పాన్ ఇండియా లెవల్లో తక్కువలో తక్కువగా రెండు వందల కోట్ల రూపాయల బిజినెస్‌నే చేస్తాయి. రాసి పెట్టుకోండి. ఆయన చేసే ప్రతి సినిమా రెండు వందల కోట్లను దాటుతుందే తప్ప.. తగ్గదు అని అన్నారు.