Jr NTR : ప్ర‌ముఖ నిర్మాత కూతురి పెళ్లి ఎన్టీఆర్ వ‌ల్ల‌నే జ‌రిగిందా?

Authored By Sam C | The Telugu News | Published on: August 24, 2022, 9:20 pm

Jr NTR : యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ విప‌రీతంగా పెరిగింది. ఎంతపెద్ద స్టార్‌ అయిన ఆయ‌న‌ ఒదిగిపోయే ఉండే వ్యక్తిత్వం చూసి అంత ఆశ్చర్యవ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తారక్‌కు సాధారణ ప్రజలే కాదు ఇండస్ట్రీలోనూ అభిమానించేవారు ఎంతోమంది ఉన్నారు. ఇదిలా ఉంటే తన పెళ్ళికి తారక్ కారణమంటూ ఆయన గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు ప్రముఖ నిర్మాత కూతురు. ఆమె ఎవరో కాదు బడా ప్రొడ్యూసర్ అశ్వినిదత్ కుమార్తె స్వప్నా దత్. స్వప్నాదత్.. ప్రసాద్ వర్మ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 2010లో వీరి వివాహం జరిగింది.

Jr NTR : అలా మూల‌కార‌ణం..

పెళ్లి గురించి మాట్లాడుతూ… ‘‘నా వివాహం జరగడానికి జూనియర్‌ ఎన్టీఆరే కారణం. పెళ్లికి ముందు తన భర్త ప్రసాద్‌ వర్మ, తాను కొంతకాలం ప్రేమించుకున్నాం. అయితే ఈ విషయాన్ని మా నాన్నకు చెప్పేంత ధైర్యం లేదు. ఎందుకంటే నాన్న నా ప్రేమను కచ్చితంగా నిరాకరిస్తారని తెలుసు. అయితే ఈ విషయాన్ని నేను శక్తి మూవీ షూటింగ్‌ సమయంలో తారక్‌తో పంచుకున్నా. తను వెంటనే ఇంట్లో చెప్పమని సలహా ఇచ్చాడు. ‘ఇలాంటి విషయాల్లో అసలు ఆలస్యం చేయకూడదు. మీ నాన్నగారితో నేను మాట్లాడుతా’ అని చెప్పి షూటింగ్‌ అయిపోయాక మా ఇంటికి వచ్చి నాన్నతో నా ప్రేమ విషయం చెప్పాడు.

Aswani Dutt Daughter Marriage Did Because Of Jr NTR

Aswani Dutt Daughter Marriage Did Because Of Jr NTR

మొద‌ట్లో కొంత సీరియ‌స్ అయిన కూడా తార‌క్ వ‌ల‌న ఒప్పుకున్నారు. అలా మా పెళ్ళికి తారక్ మూలకారణం అయ్యాడు అని అన్నారు స్వప్న. ఇక అశ్వినీదత్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ ఫ్యామిలోకి మంచి అనుభందం ఉన్న విషయం తెలిసిందే. తండ్రి అనంతరం ప్రస్తుతం వైజయంతి బ్యానర్ వ్యవహారాలు, బాధ్యతలను స్వప్నాదత్‌ ఆమె సోదరి ప్రియాంక దత్‌లు చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌ల ఎన్టీఆర్ రాజకీయాల‌లోకి రానున్నార‌ని జోరుగా ప్ర‌చారం న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అటువైపు, జూనియర్ ఎన్టీఆర్ కూడా హుందాగా ఉంటూ వస్తున్నారు. ఎన్టీఆర్ నటనా వారసత్వాన్ని బల్లగుద్ది చాటుకున్నా, రాజకీయ వారసత్వం విషయంలో ఆయన చాలా అణకువతో, మెలకువతో ఉన్నారు. ఒక్క మాట మాట్లాడరు. ఒక్క ఆకాంక్ష వెల్లడించరు. అసలు తాను రాజకీయ ప్రపంచంలో లేనట్టే ఉంటున్నారు. ఇదే జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణ.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp