
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి గుడి కట్టాలా.. వైసీపీ నేత నుండి స్టన్నింగ్ కామెంట్స్..!
Pawan Kalyan : ఇటీవల ఏపీ రాజకీయాలు ఎంత రంజుగా మారాయో మనం చూశాం. కూటమి, వైసీపీ మధ్య పోరు ఓ రేంజ్‌లో సాగింది. ఎవరు గెలుస్తారా అనే సస్పెన్స్ ఉండగా, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో కూటమి ఘన విజయం సాధించడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది కీలకపాత్ర అని.. కేవలం పవన్ వల్ల మాత్రమే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిందని.. ఈ గెలుపులో ఆయనే “మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్” అనే కామెంట్స్ వినిపించాయి. మొన్నటివరకూ దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, నాలుగు పెళ్లాలు అంటూ పవన్ పై వైసీపీ నేతలు తీవ్రంగా విరుచుకుపడగా, రిజల్ట్స్ తర్వాత మాత్రం కూటమి గెలుపు క్రెడిట్ మొత్తం పవన్ ఇస్తున్నారు వైసీపీ నేతలు.
చంద్రబాబు అలవిగాని హామీలతో పాటు పవన్ ఛరిష్మా వల్లే టీడీపీ నేతలు కూడా గెలిచారని అంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ వల్లే గెలిచారు.. ఆయనకు వారంతా గుడి కట్టి పూజలు చేయాలి అంటూ కామెంట్ చేశారు మాజీ ఎంపీ, వైసీపీ నేత మార్గాని భారత్. తాజాగా విభజన సమస్యలమీద రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయిన ఘటనపై స్పందిస్తూ… ఆ భేటీకి ఉప ముఖ్యమంత్రి పవన్ ను ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ… టీడీపీ నేతలపై కామెంట్లు చేశారు. ఇందులో భాగంగా… రెండు రాష్ట్రాల సీఎంలు భేటీలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారని గుర్తు చేసిన భరత్… మరి ఇంత కీలకమైన భేటీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఆహ్వానించకపొవడం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి గుడి కట్టాలా.. వైసీపీ నేత నుండి స్టన్నింగ్ కామెంట్స్..!
అసలు ఇవాళ టీడీపీ కూటమి అధికారంలో ఉందంటే… దానికి నూటికి 99 మార్కులు పవన్ కల్యాణ్ కు ఇవ్వాలని.. అలాంటి పవన్ లేకుండా సమావేశం జరిగిందని అన్నారు. ఏపీ పోర్టుల్లో తెలంగాణ వాటా అడుగుతుందని.. టీటీడీలోనూ తెలంగాణ వాటా అడుగుతోందనే వార్తలొచ్చాయన్న ఆయన.. ఈ వార్తలను ఎవరూ ఖండించలేదన్నారు.ఏపీకి తెలంగాణ నుంచి రూ.7,200 కోట్ల విద్యుత్ బకాయిలు రావాల్సి ఉందన్న మార్గాని భరత్.. భద్రాచలం వద్ద 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతారనే వార్తలొచ్చాయన్నారు. వీటిని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. విభజన చట్టం కాలపరిమితి పదేళ్లు మాత్రమేనన్న భరత్.. దాన్ని మరో పదేళ్లపాటు పొడిగిస్తే బాగుంటుందన్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.