Indraja : ఇంద్రజ పరువు తీసేశారు.. రాం ప్రసాద్ మామూలోడు కాదు

 Authored By prabhas | The Telugu News | Updated on :5 May 2022,11:00 am

Indraja : బుల్లితెరపై ఇంద్రజ ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. జబర్దస్త్ షోకు గెస్టుగా వచ్చి ఇప్పుడు జడ్జ్‌గా ఫిక్స్ అయిపోయింది. ఆ మధ్య రోజాకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో వచ్చిన గ్యాప్‌ను ఇంద్రజ పూరించింది. అయితే ఇప్పుడు ఫుల్ టైం జడ్జ్‌గా ఇంద్రజ ఫిక్స్ అయిపోయింది. జబర్దస్త్ షోకంటే ముందు ఇంద్రజ.. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు జడ్జ్‌గా వ్యవహిరించింది. ఆ షో సూపర్ హిట్ అయింది.ఇంద్రజ, సుధీర్ మదర్ అండ్ సన్ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. ఇంద్రజను చేయి పట్టుకుని తీసుకొచ్చి మరీ తన కుర్చీ వద్ద కూర్చోబెడతాడు సుధీర్.

ఇక ఇంద్రజ అయితే జడ్జ్ మెంట్ చెప్పే సమయంలో వీరావేషానికి లోనవుతుంది. ఎవరైనా పాటలు పాడితే తన్మయత్వానికి లోనై.. వేరే ప్రపంచానికి వెళ్తుంది. డ్యాన్సులు, పాటలు ఇలా అన్నింట్లోనూ ఇంద్రజ అదరగొడుతుంది.అయితే ఇప్పుడు ఇంద్రజ తన శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో చేసే వాటిని ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో స్పూప్‌గా చేసి చూపించాడు. ఇంద్రజల గెటప్పు వేసుకుని రాం ప్రసాద్ అదరగొట్టేశాడు. ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్‌ని కాస్తా శ్రీదేవీ డ్రామా కంపెనీగా మార్చేశారు. తనలా డ్యాన్స్ వేయడంతో..

Auto Ram Prasad GetupAs Indraja In Extra Jabardasth

Auto Ram Prasad GetupAs Indraja In Extra Jabardasth

రాం ప్రసాద్‌ని చూసి ఇంద్రజ తల పట్టుకుంటుంది. మీరెక్కడ దొరికార్రా బాబు అన్నట్టుగా చూస్తుంది.ఇక ఇంద్రజను పట్టుకుని వచ్చినట్టే.. రాం ప్రసాద్‌ని కూడా పట్టుకుని కుర్చీ వద్దకు తీసుకొస్తాడు సుధీర్. నువ్ ఇలా పట్టుకొస్తుంటే నా ఏజ్ ఎక్కువని అంతా అనుకుంటున్నారు.. నీ క్లోజప్ షాట్స్ కోసం నా ఏజ్ పెంచుకు అని రాం ప్రసాద్ అంటాడు. దీంతో ఇంద్రజ పగలబడి నవ్వేస్తుంది. ఆ తరువాత ఇంద్రజ స్టైల్లోనే ఓ జడ్జ్మెంట్ ఇస్తాడు రాం ప్రసాద్. దీంతో అందరూ నవ్వేస్తారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి