Avika Gor : నా బాడీగార్డే న‌న్ను అక్క‌డ అభ్యంగా తాకాడని చెప్పిన చిన్నారి పెళ్లి కూతురు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Avika Gor : నా బాడీగార్డే న‌న్ను అక్క‌డ అభ్యంగా తాకాడని చెప్పిన చిన్నారి పెళ్లి కూతురు..!

Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌తో ఫుల్ ఫేమ‌స్ అయిన అందాల భామ అవికా గోర్. అందులో ముద్దు ముద్దు మాటలతో.. అవికా ఎంతో అందంగా కనిపించింది. ఈ చిన్నారి నవ్వితే ప్రేక్షకులు నవ్వారు.. ఏడిస్తే ఏడ్చారు. అలా బాలనటి నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. తెలుగులో ఉయ్యాలా జంపాలా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక వరుస అవకాశాలు దక్కించుకున్న అవికా.. విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ భామ […]

 Authored By ramu | The Telugu News | Updated on :19 June 2024,5:00 pm

Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్‌తో ఫుల్ ఫేమ‌స్ అయిన అందాల భామ అవికా గోర్. అందులో ముద్దు ముద్దు మాటలతో.. అవికా ఎంతో అందంగా కనిపించింది. ఈ చిన్నారి నవ్వితే ప్రేక్షకులు నవ్వారు.. ఏడిస్తే ఏడ్చారు. అలా బాలనటి నుంచి హీరోయిన్‌ స్థాయికి ఎదిగింది. తెలుగులో ఉయ్యాలా జంపాలా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక వరుస అవకాశాలు దక్కించుకున్న అవికా.. విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. ఈ భామ నటించిన సినిమాల్లో కొన్ని పర్వాలేదు అన్నట్లుగా నిలిచిన కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో అవికా స్టార్ డ‌మ్ ద‌క్కించుకోలేక‌పోయింది.

Avika Gor : తాక‌రాని చోట తాకాడు..

అవికా ఆ మ‌ధ్య బొద్దుగా ఉండేది. ఇప్పుడు మ‌ళ్లీ క్యూట్ లుక్‌లోకి మారి సంద‌డి చేస్తుంది.. రీ ఎంట్రీలో అయితే అందాల ఆరబోత ఓ రేంజ్ లో చేసింది. ఇక అప్పుడ‌ప్పుడు అవికా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ ఆస‌క్తిక‌ర విషయాలు వెల్ల‌డిస్తూ ఉంటుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనకి ఎదురైన ఓ చేదు అనుభవం గురించి అవికా పంచుకుంది. కజక్‌స్థాన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో తనకి ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని అవికా చెప్పింది. వేదికపైకి వెళుతున్నప్పుడు తన బాడీగార్డ్‌ అనుచితంగా తనని తాకినట్లు తెలిపింది. ఈ సంఘటన తనని షాక్‌కి గురి చేసిందని చెప్పింది.

Avika Gor నా బాడీగార్డే న‌న్ను అక్క‌డ అభ్యంగా తాకాడని చెప్పిన చిన్నారి పెళ్లి కూతురు

Avika Gor : నా బాడీగార్డే న‌న్ను అక్క‌డ అభ్యంగా తాకాడని చెప్పిన చిన్నారి పెళ్లి కూతురు..!

కారు దిగి నడుస్తున్న సమయంలో ఎవరో వెనక నుంచి టచ్ చేసినట్లు అనిపించింది. తిరిగి చూస్తే బాడీగార్డ్‌ మాత్రమే ఉన్నాడు. వేదిక పైకి వెళ్తున్నప్పుడు కూడా చెప్పలేని చోట తాకే ప్రయత్నం చేశాడు. అది గమనించి వెంటనే చేయి పట్టుకున్నాను. ‘ఏం చేస్తున్నారు మీరు’ అని గట్టిగా అరిచాను. అతడు క్షమాపణలు చెప్పడంతో ఏం చేయలేక వదిలేశాను. నాకు ధైౖర్యం ఉంటే ఇలా చేసిన చాలామందిని కొట్టేదాన్ని. కానీ అప్పట్లో అంత ధైర్యం లేదు. ఇలాంటి అనుభవం ఇప్పుడు ఎదురైతే కచ్చితంగా ఎదురుతిరుగుతాను. అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలా ఎవరూ ప్రవర్తించడం లేదు. ఎదుటివారు చేసే కొన్ని పనులు మనపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అది వాళ్లకు తెలియదు’ అని అన్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది