Avinash : భార్య‌ను ప‌క్క‌న పెట్టి ఇత‌ర అమ్మాయిల‌తో ఆ ర‌చ్చేంది అవినాషా..!

Authored By Sam C | The Telugu News | Published on: July 12, 2022, 5:30 pm

Avinash : జ‌బ‌ర్ధ‌స్త్ షోతో మంచి క్రేజ్ అందుకున్న క‌మెడీయ‌న్స్‌లో అవినాష్ ఒక‌రు. అత‌డు ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ కమెడీయ‌న్‌గా అవ‌త‌రించాడు. బిగ్ బాస్ షో అవ‌కాశం కూడా ద‌క్కించుకున్న అవినాష్ అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకున్నాడు. అయితే బిగ్ బాస్ షోకు వెళ్లేందుకు కూడా పది లక్షలు కట్టాల్సి వచ్చింది. బాండ్ ప్రకారం.. మల్లెమాలకు పది లక్షలు చెల్లిస్తేనే బిగ్ బాస్ షోకు వెళ్లనిస్తామని కండీషన్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పది లక్షలు కూడా శ్రీముఖి అరేంజ్ చేసిన సంగతి తెలిసిందే. అలా మొత్తానికి ఎన్నో కష్టాలు పడి బిగ్ బాస్ ఇంట్లో ఉన్నాడు. దాదాపు యాభై లక్షల వరకు వెనకేసుకున్నాడు.

కష్టాల నుంచి బయటపడ్డాడు. ఆ త‌ర్వాత పెళ్లి కూడా చేసుకున్నాడు. అవినాష్. భార్యతో కలిసి వీడియోలు చేస్తూ అటు యూట్యూబ్లో కూడా సందడి చేస్తున్నాడు. గ‌త ఏడాది అక్టోబర్ 20న అవినాష్ పెళ్లి జరగగా, 24న గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. తన సొంత ఊరు జగిత్యాలలో జరిగిన ఏ వేడుకలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు, జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఒకే చోట చేరి తెగ సందడి చేశారు. చమ్మక్ చంద్ర, తాగుబోతు రమేష్, శ్రీముఖిల అల్లరితో పెళ్లింట సందడి వాతావరణం నెలకొంది. మెహెందీ, హల్దీ, పెళ్లి, రిసెప్షన్ ఇలా అన్నింటా ఫుల్ ఎంజాయ్ చేస్తూ హంగామా చేశారు. అవినాష్ పెళ్లి, రిసెప్ష‌న్‌కి సంబంధించిన ఫొటోలు తెగ సంద‌డి చేశాయి.

avinash fun with ariyana

avinash fun with ariyana

Avinash : అరియానాతో ర‌చ్చ‌..

పెళ్లి త‌ర్వాత అవినాష్ త‌న స‌తీమ‌ణితో క‌లిసి ప‌లు టీవీ షోల‌లో కూడా పాల్గొంటున్నాడు. వీరిద్ద‌రు క‌లిసి చేసే సంద‌డి పీక్స్‌లో ఉంది. కొంద‌రు వీరిని చూసి చూడ ముచ్చ‌టైన జంట అని అంటున్నారు. మ‌రి కొంద‌రు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా అవినాష్ త‌న భార్య లేకుండా అరియానా, దివిల‌తో క‌లిసి డ్యాన్స్ లు చేస్తూ నానా ర‌చ్చ చేస్తున్నాడు. పెళ్లాన్ని ప‌క్క‌న ప‌డేసి ఈ ర‌చ్చేంద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైన అరియానా త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోకి నెట్టింట మంచి స్పంద‌న వ‌స్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  2. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  3. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  4. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

  5. "Vijay Deverakonda Sukumar : విజయ్‌కు సుకుమార్ సినిమా పడితే కెరీర్ టర్నింగ్ పాయింటేనా? ఆరేళ్లుగా ఎదురుచూపులు!"

  6. "AP Local Body Elections : ఏపీలో కూటమి మాస్టర్ ప్లాన్.. బీసీలకు అదనపు టికెట్లు, మహిళలకు పెద్దపీట!"

  7. "Navratri Fasting Rules : నవరాత్రుల ఉపవాసం చేస్తున్నారా? పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp