Sreemukhi : శ్రీముఖికి డ‌బ్బులు పంచిన అవినాష్‌.. అన్నీ చూసి నోరెళ్ల‌పెట్టిన రాములమ్మ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sreemukhi : శ్రీముఖికి డ‌బ్బులు పంచిన అవినాష్‌.. అన్నీ చూసి నోరెళ్ల‌పెట్టిన రాములమ్మ‌

 Authored By sandeep | The Telugu News | Updated on :21 March 2022,4:30 pm

Sreemukhi : బుల్లితెర పాపుల‌ర్ క‌మెడీయ‌న్స్ లో అవినాష్ ఒక‌రు. అత‌ను ఓ వైపు టీవీల‌లో సంద‌డి చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంటాడు. బిగ్ బాస్ సీజన్ 4లో జోకర్ గా వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను సెట్ చేసుకున్నాడు. అంతకముందు జబర్దస్త్ షో ద్వారా కొన్నాళ్ల పాటు హ్యాపీగానే కొనసాగిన అవినాష్ ఆ తరువాత సడన్ గా లాక్ డౌన్ రావడంతో ఒక్కసారిగా ఆర్థిక ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత మెల్లగా బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తనను తాను సరికొత్తగా ప్రజెంట్ చేసుకున్నాడు.ఇక ఇటీవ‌ల పెళ్లి చేసుకోని ఓ ఇంటివాడు కూడా అయ్యాడు.

బిగ్ బాస్ అనంతరం అవినాష్ లైఫ్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. భారీగా ఆదాయం అందుకోవడమే కాకుండా సొంతంగా ఓ ప్రత్యేకమైన ఇంటిని కూడా కట్టుకున్నాడు. ప్రస్తుతం కొన్ని షోలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అవినాష్ ఎక్కువ‌గా శ్రీముఖితో క‌లిసి ర‌చ్చ చేస్తుంటాడు. శ్రీముఖి అవినాష్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు అని అందరికీ తెలిసిన విషయమే. అవినాష్ రెగ్యులర్ గా శ్రీముఖికి సంబంధించిన షోలల్లో కూడా కనిపిస్తుంటాడు. బిగ్ బాస్ లోకి వెళ్లేముందు జబర్దస్త్ నిర్వాహకుల నుంచి ఎన్ ఓ సీ తీసుకునేందుకు అవినాష్ గట్టిగా ప్రయత్నం చేశాడు.

avinash makes fun with sreemukhi

avinash makes fun with sreemukhi

Sreemukhi : అవినాష్‌తో శ్రీముఖి ర‌చ్చ‌..

జబర్దస్త్ నిర్వాహకులకు లక్షల్లో డబ్బు కట్టాల్సివచ్చింది. ఇక అప్పుడు శ్రీముఖి అవినాష్ కు అండగా నిలిచింది. ఆమె చేసిన సహాయాన్ని అవినాష్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకున్నాడు కూడా. ఇక అవినాష్ పెళ్లి లో శ్రీముఖి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన విష‌యం తెలిసిందే. పెళ్లైన కూడా అవినాష్ శ్రీముఖి జంట తెగ అల‌రిస్తూ ఉంటారు. తాజాగా ఓ యాడ్‌లో భాగంగా శ్రీముఖి, అవినాష్ జట్టు క‌ట్టారు. అవినాష్‌.. శ్రీముఖికి డ‌బ్బులు పంచ‌గా, అన్ని డ‌బ్బులు ఎక్క‌డివి అంటే కారు చూపించి అస‌లు విష‌యం చెప్పాడు.యాడ్ లో భాగంగా వీరిద్ద‌రు చేసిన ర‌చ్చ హైలైట్ అయింది.

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది