Radhe Shyam : రాధే శ్యామ్ పరువు తీసిన బాబు గోగినేని.. తుస్ అంటగా అంటూ ట్వీట్
Radhe Shyam : ప్రభాస్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం రాధే శ్యామ్. మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ పొందింది. మూడు వందల కోట్ల మేరకు భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రాధే శ్యామ్‌ను గోపీ కృష్ణ మూవీస్ యువీ క్రియేషన్స్ బ్యానర్స్‌పై రాధా కృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వంశీ, ప్రమోద్, ప్రసీధ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆశించిన స్థాయిలో సినిమా విజయాన్ని సాధించలేకపోయింది. ఈ క్రమంలో సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో పాలుట పలువురు ప్రముఖులు పెదవి విరుస్తున్నారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ రెమ్యునరేషన్ మినహాయిస్తే.. రాధే శ్యామ్‌కి అంత భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సినిమాకు కేటాయించిన బడ్జెట్‌లో ఐదో వంతు బడ్జెట్‌తో సినిమాను పూర్తి చేయవచ్చు.
ఎందుకంటే రాధే శ్యామ్ ఓ ఇన్‌టెన్స్ లవ్ స్టోరి. దీనికి విజువల్స్ ఫీస్ట్ అవసరం లేదు. గీతాంజలి తరహాలో మంచు కొండలు వంటి లొకేషన్స్ చాలు. ప్రభాస్ సినిమాను అభిమానులు ఎలా ఉన్నా ఆదరిస్తారు. ఇలాంటి ప్రేమకథల్లో విజువల్ ఎఫెక్ట్ ఉండటం వల్ల అవి సినిమాలోని ఎమోషన్స్‌ను చంపేస్తాయి. అందుకనే ఆడియెన్స్ కనెక్ట్ కాలేకపోయారు. సినిమా కోసం వేసిన సెట్స్ ఆర్టిఫిషియల్‌గా అనిపించడంతో సినిమాలో పాత్రలు కూడా ఆర్టిఫీషియల్‌గా అనిపించాయి అని అన్నారు.ఇక తాజాగా ఈ సినిమాపై బాబు గోగినేని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. “మీరూ మీ అబద్ధాలు !నిజంగా కెప్లర్ ఏం చెప్పాడంటే…
Radhe Shyam : దారుణమైన కామెంట్స్..
జ్యోతిష్యం అనేది గౌరవప్రదమైన, సహేతుకమైన తల్లి ఖగోళశాస్త్రం మూర్ఖపు చిన్న కుమార్తె… బుద్ధి ఉన్నోడు ఎవడన్నా వాట్సప్ చూసి డైలాగులు రాస్తాడా ? తుస్ అంటగా సినిమా… మరేం సినిమా తీసే ముందే చేయి చూపించుకోవాల్సింది విక్రమ్ ఆదిత్యతో” అంటూ “రాధేశ్యామ్” మేకర్స్ పై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. అంతేకాదు కెప్లర్ కు సంబంధించిన ఓ లింక్ కు కూడా ఈ పోస్టుకు జత చేశాడు బాబు గోగినేని. అయితే ఆయన వ్యాఖ్యలపై కార్యకర్త, మానవతావాది సినిమాను సినిమాలా చూడకుండా ఇలాంటి కామెంట్స్ చేయడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.