
Baby movie break Box office on Monday
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ‘ బేబీ ‘ సినిమా పేరు వినిపిస్తుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 14న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ లు నటించారు. లవ్ స్టోరీ కావడంతో ఈ సినిమాకి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. విడుదలై వారం రోజులు కూడా కావడం లేదు ఇప్పటికే ఈ సినిమా 11 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. చిన్న సినిమా అయినప్పటికీ మంచి కంటెంట్ ఉండడంతో పెట్టిన దానికి పదింతలు ఎక్కువగా లాభాలు వచ్చాయి.
అయితే సోమవారం రోజు ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హౌస్ ఫుల్స్ పడడం షాకింగ్. వీకెండ్ తర్వాత ఇలా హౌస్ ఫుల్ కావడం నిజంగా గ్రేట్. మామూలుగా రాయలసీమలో మాస్ సినిమాలకు మాత్రమే సోమవారం వసూళ్లు నిలకడగా ఉంటాయి. కానీ ఈ చిన్న సినిమా అలాంటి ఏరియాల్లో హౌస్ ఫుల్స్ తో రన్నవ్వడం పెద్ద షాక్. తిరుపతి, కడప, కర్నూలు లాంటి సిటీలో బేబీ సినిమాకి మ్యాట్నీలు ఫుల్ అయ్యాయి. కడపలో ఈ సినిమా ఆడుతున్నా రాజా థియేటర్లో హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టేశారు మ్యాట్నీకి. తిరుపతిలో ఒకటికి మించి ధియేటర్లు పుల్లయ్యాయి. కర్నూల్లో కూడా అదే పరిస్థితి.
Baby movie break Box office on Monday
ఇక ఆంధ్ర ప్రాంతంలో వైజాగ్ లాంటి పెద్ద సిటీలోనే కాకుండా చిన్న నగరాల్లో కూడా బేబీ సినిమాకి ఫుల్స్ పడడం విశేషం. వైజాగ్లో మధ్యాహ్నం మూడు షోలు ఫుల్ అయ్యాయి. నైజాం ఏరియాలో కూడా బేబీ సినిమా దూసుకెళ్తోంది. సిటీలో పలు థియేటర్లలో మధ్యాహ్నం నుంచి ఆక్యూ పెన్సిలు వచ్చాయి. కొన్ని థియేటర్లు పుల్లయ్యాయి సాయంత్రం రాత్రి షోలకు మరింత మంచి ఆక్యుపెన్సీ ఉంటుంది అనడంతో సందేహం లేదు. వీకెండ్ తర్వాత కూడా ఇంత బలంగా నిలబడిన ఈ చిన్న సినిమాను ఈ మధ్యకాలంలో చూసి ఉండరు. రోజురోజుకు ఈ సినిమా రేంజ్ పెరిగిపోతుంది. చూడాలి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో.
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
This website uses cookies.