Vaishnavi Chaitanya : పెళ్లి చేసుకుంటే ఆ హీరోనే చేసుకుంటా .. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్..!
Vaishnavi Chaitanya : ఇటీవల చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయాన్ని అందుకున్నటువంటి సినిమా బేబీ. ఆ సినిమాతో వైష్ణవి చైతన్య అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఏకంగా 90 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇలా థియేటర్లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా లో ప్రసారమవుతుంది.ఆహా ఓటీటి వాట్సాప్ బేబీ పేరుతో వైష్ణవి చైతన్య వీడియోను పంచుకుంది. ఇందులో భాగంగా నెటిజెన్లు అడిగిన ప్రశ్నలకి వైష్ణవి చైతన్య సమాధానాలు చెబుతూ వచ్చారు.
మీరు విరాజ్ అశ్విన్, ఆనంద్ దేవరకొండ ఇద్దరిలో ఎవరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తే ఎవరిని చేసుకుంటారు అనే ప్రశ్న ఎదురయింది. దీనికి వైష్ణవి చైతన్య సమాధానం చెబుతూ పెళ్లి చేసుకోనని సమాధానం చెప్పారు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ నాకు బాగా నచ్చిందని చెప్పారు. బేబీ సినిమాలో వైష్ణవి చేసిన క్యారెక్టర్ పై ప్రశ్న కూడా ఎదురయింది. ఇలాగే చేయాలి అని ఎప్పుడు అనుకోకూడదు కథ ఆధారంగా ఏం చేయాలో అది కచ్చితంగా చేయాలి.ఇక మీకు వైష్ణవి పాత్ర నచ్చిందా అని అడగటంతో చాలా బాగా నచ్చింది అంటూ ఈ సందర్భంగా వైష్ణవి చైతన్య సమాధానం చెప్పారు.
ఇక ఈ సినిమాను సాయి రాజేష్ దర్శకత్వ వహించారు.ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో నటించిన వైష్ణవి చైతన్యకి మంచి గుర్తింపు వచ్చింది. యూట్యూబర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ బేబీ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా అంతలా హిట్ అవ్వడానికి వైష్ణవి చైతన్య పాత్రే అని చాలామంది అంటున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో వైష్ణవి చైతన్యకి వరుస ఆఫర్లు వస్తున్నాయి మొదటి సినిమాతో ఆకట్టుకున్న వైష్ణవి చైతన్య తర్వాత సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి అయితే పెళ్లిపై మాత్రం వైష్ణవి చైతన్య షాకింగ్ గా సమాధానం ఇచ్చారు అసలే అసలు పెళ్లి చేసుకోను అని సమాధానం ఇచ్చారు ఇప్పుడే హీరోయిన్గా ఎదుగుతున్న వైష్ణవి చైతన్యకచైతన్య ఇప్పట్లో పెళ్లి చేసుకోదని అర్థమవుతుంది.