Prabhas : ఆదిపురుష్ విడుదల హ్యాపీ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి అతిపెద్ద బ్యాడ్ న్యూస్ !

 Authored By aruna | The Telugu News | Updated on :16 June 2023,9:00 am

Prabhas : బాహుబలి తర్వాత ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. ఇప్పటికే ఆది పురుష్ సినిమాతో రేపు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాడు. రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతా దేవిగా కనిపించనున్నారు. రాముడిగా ప్రభాస్ ప్రేక్షకులను మెప్పిస్తాడో లేదో చూడాలి. ఇకపోతే ప్రభాస్ ఒక్కసారే నాలుగైదు ప్రాజెక్టులు ఒప్పుకున్నాడు అన్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ సినిమాతో పాటు రాజా డీలక్స్,, ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలు ఒప్పుకున్నాడు.

అయితే తాజాగా ప్రభాస్ మారుతి డైరెక్షన్లో రాబోతున్న రాజా డీలక్స్ సినిమా షూటింగ్ జరుగుతుంది. హర్రర్ కామెడీ సినిమాగా ఇది తెరకెక్కుతోంది. సలార్ ప్రాజెక్ట్ -కె లతో ఎంత బిజీ గా ఉన్నా మారుతి కోసం డార్లింగ్ డేట్లు కేటాయించి పూర్తిచేసే పని లో పడ్డారు. మారుతి పై డార్లింగ్ ఎంతో నమ్మకంతో చేస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు ఇద్దరి మధ్య మరో సినిమాకి సంబంధించి అగ్రిమెంట్ జరిగిందా మరోసారి ఇద్దరు చేతులు కలపబోతున్నారా అంటే అవుననే తెలుస్తుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను ఈ సంస్థ రిలీజ్ చేస్తుంది.

Prabhas fans full fire on that star hero fans

Prabhas fans full fire on that star hero fans

ఈ క్రమంలోనే సంస్థ అధినేతన తమ బ్యానర్ ప్లానింగ్ లో భాగంగా మారుతి సినిమా రివీల్ చేశారు. వచ్చే రెండు, మూడేళ్లలో హాలీవుడ్ సినిమాలు పాన్ వరల్డ్ చిత్రాలకు నిర్మించాలని టార్గెట్ గా పెట్టుకున్నాం. ఇందులో విదేశాల్లో స్టూడియో లతో పాటు అన్ని రకాల వసతులు సమకూర్చుకుంటున్నాం . మరో ఆరేడు నెలల్లో మా సంస్థలో వచ్చే 50వ చిత్రాన్ని ప్రకటిస్తాం. అలాగే మారుతి-ప్రభాస్ సినిమా ని సమయం వచ్చిన వెంటనే ప్రకటిస్తామని తెలిపారు. దీన్ని బట్టి ముగ్గురి మధ్య ఓ సినిమాకి అధికారికంగా ఒప్పందం జరిగినట్లు తెలుస్తుంది. అదెప్పుడన్నది క్లారిటీ రావడానికి సమయం పడుతుంది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి