Home » Entertainment » Bad Sentiment For Megastar Chiranjeevi Waltair Veerayya Movie
Entertainment

Waltair Veerayya Movie : ఈ ఒక్క సెంటిమెంట్ మెగా ఫ్యాన్స్ కి వణుకు తెప్పిస్తోంది .. వాల్తేరు వీరయ్య అట్టర్ ఫ్లాప్ గ్యారెంటీ ?

Authored By
Rame Samhith
The Telugu News | Published on: December 3, 2022, 8:30 pm
Advertisement

Waltair Veerayya Movie : మెగాస్టార్ చిరంజీవి బాబీ డైరక్షన్ లో వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ మూవీ విషయంలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ లో అంచనాలను పెంచడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నా ఎక్కడో ఒక చోట అభిమానులకు నెగటివ్ సెంటిమెంట్ కొడుతుంది. మరీ ముఖ్యంగా చిరు సినిమాలకు ఈమధ్య టాక్ బాగున్నా వసూళ్లు లేకపోవడంతో మెగా ఫ్యాన్స్ మరింత డల్ అవుతున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాపై మెగా ఫ్యాన్స్ ఎందుకు డౌట్ పడుతున్నారు అంటే ఇందులో మరో హీరో రవితేజ నటించడమే.. అదేంటి చిరు సినిమాలో రవితేజ ఉంటే ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ కదా అని అనుకోవచ్చు.

Advertisement

రవితేజ నటించడం అనేది క్రేజీ థింగే కానీ రీసెంట్ గా చిరు సినిమాలను గమనిస్తే ఆయన ఒక్కరే ఉండకుండా మరో హీరో ఆయన సినిమాలో నటిస్తే అవన్ని అస్సాం వెల్తున్నాయి అదేనండి ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఆచార్య సినిమాలో చిరుతో పాటు తనయుడు రాం చరణ్ నటించాడు. అతను నటించడంతో మెగా ప్రాజెక్ట్ గా ఈ మూవీ క్రేజ్ తెచ్చుకుంది తీరా చూస్తే అది కాస్త బాక్సాఫీస్ దగ్గర తుస్సుమంది. ఇక నెక్స్ట్ వచ్చిన గాడ్ ఫాదర్ కూడా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించారు.

bad Sentiment for Megastar Chiranjeevi Waltair Veerayya Movie

Advertisement

ఈ మూవీ కూడా టాక్ బాగానే ఉన్నా కలక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ చిరుతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ మూవీ కూడా రిజల్ట్ తేడా కొడుతుందా అని సెంటిమెంట్ తో మెగా ఫ్యాన్స్ లో వణుకు మొదలైంది. మరి ఈ రిజల్ట్ తేలాలంటే మాత్రం సంక్రాంతి వరకు వెయిట్ చేయాల్సిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే బాస్ పార్టీ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచింది.

Rame Samhith

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి