baladitya wife serioua on Geetu Royal
Geetu Royal : బిగ్ బాస్ సీజన్ 6 లో అందరికంటే మంచివాడు ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు బాలాదిత్య. ఈవారం ఎలిమినేట్ అయినా చలాకి చంటి కూడా ఇదే మాట చెప్పాడు అయితే అది పూర్తిగా మేకప్ అని అది బయట తీసిన రోజు బాలాదిత్య అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది అంటూ చెప్పాడు చంటి. షో మొదలైన 5 వారాల తర్వాత ఆయనలో కోపం బయటికి వచ్చింది అప్పటి వరకు లోపల అసలు కోపమే లేనట్టు చాలా శాంతంగా, ప్రశాంతంగా కనిపించాడు బాలాదిత్య. చివరకు ఆయనకు కోపం తెప్పించిన ఘనత మాత్రం గీతు సొంతమైంది. ఇదిలా ఉంటే బాలాదిత్య, గీతూ మధ్య జరిగిన గొడవ వాళ్ల కుటుంబాల వరకు వెళ్లిందని..
గీతూ పేరు చెప్తే చాలు బాలాదిత్య భార్య మండిపడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.గత వారం టాస్క్ లో భాగంగా బాలాదిత్య మాట్లాడుతున్నప్పుడు.. మధ్యలో గీతూ ఏదో మాట్లాడబోతుండగా.. తప్పు.. తప్పు అది.. నీకు అర్థం కాకపోతే హేళన చేస్తావా అని వేలు చూపిస్తూ గీతూకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు బాలాదిత్య. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. మరోవైపు బిగ్ బాస్ ఇంట్లో అందరినీ వేరువేరుగా చూసే గీతూ.. కేవలం బాలాదిత్యను మాత్రమే తన ఫ్యామిలీ మెంబర్ అని చెప్పింది. ఆయనను నోరార అన్నయ్య అని పిలుస్తుంది. నేను అంతగా ఇష్టపడే నిన్ను ఎందుకు తక్కువ చేస్తాను అన్న అని చెప్పబోతుంటే కూడా బాలాదిత్యా ఏమాత్రం వినలేదు. గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు ఆపు.. వింటున్నా.. అన్నీ వింటున్నా.. ఆట పట్టించడానికి అయినా లిమిట్ ఉంటుంది..
baladitya wife serioua on Geetu Royal
అది దాటితే ఇలాగే ఉంటుంది అంటూ సీరియస్ గా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు బాలాదిత్యా. ఇది విన్న తర్వాత గీతూ కూడా బాగానే హర్ట్ అయింది. ఎందుకంటే అంతకు ముందు వారం తనకు ఓ టాస్క్ లో భాగంగా డబ్బులు ఇవ్వలేదని కోపం బాగా పెట్టుకుంది గీతూ. ఇప్పుడు అందరి ముందు బాలాదిత్య అర్చేసరికి విషయం ఇంకా పెద్దదయింది. పైగా తన చదువును హేళన చేసింది అంటూ ఆమెపై మండిపడ్డాడు బాల. ఇదే విషయంపై బయట బాలాదిత్య భార్య కూడా గీతూను తప్పు పట్టిందని తెలుస్తోంది. ఇంట్లో అనవసరంగా రెచ్చగొడుతూ అందరి మధ్య గొడవలు పెడుతుందని ఈమె గీతు గురించి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
This website uses cookies.