
it would have been better if Chiranjeevi had become the chief minister
Chiranjeevi : మెగాస్టార్ కెమెరా ముందు ఎలా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనను దాదాపు 40 సంవత్సరాలు నుంచి చూస్తూనే ఉన్నాం. ఒక్కసారి కెమెరా ఆన్ అయింది అంటే చిరంజీవిలోని మరో మనిషి బయటకు వస్తాడు. అప్పటి వరకు ఎలా ఉన్నా కూడా.. కెమెరా కళ్ళు తనను చూస్తున్నాయని తెలిసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటాడు చిరంజీవి. ఎట్టి పరిస్థితుల్లో తన టెంపర్ లాస్ అవ్వడు.. చాలా కూల్ గా మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి చిరంజీవికి గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో పీకలదాకా కోపం వచ్చింది. మీడియాను అనరాని మాటలు అనేశాడు.. ఆ తర్వాత ఆయింట్మెంట్ రాశాడు. అసలు ఇందులో చిరంజీవి నిజంగా కోపంగా మాట్లాడారా లేదంటే ఓవర్ యాక్షన్ చేశాడా..?
సాధారణంగా మీడియా ముందు చాలా ప్రశాంతంగా కనిపించే చిరంజీవి.. గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మాత్రం చాలా కోపంగా కనిపించాడు. ఎప్పుడూ లేని విధంగా మీడియాను వేలెత్తి చూపడమే కాకుండా.. తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించాడు. ఇదంతా ఆచార్య సినిమా తాలూకు కోపమా లేదంటే గాడ్ ఫాదర్ సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ కలెక్షన్స్ తీసుకురావడం లేదన్న ఫ్రస్టేషన్ ఆ అనేది అర్థం కావడం లేదు. ఎందుకంటే సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం అంతగా లేవు. అసలు విషయం ఏమిటంటే గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో మీడియా గురించి కాస్త ఓవర్గా రియాక్ట్ అయ్యాడు చిరంజీవి. ఈ సినిమా రిలీజ్ కి ముందు ప్రమోషన్ విషయంలో చాలా అలసత్వం ప్రదర్శించారు అంటూ మీడియా తమపై రాసిన వార్తలను తప్పుపట్టాడు మెగాస్టార్. తమ సినిమా గురించి తమకు తెలుసు అని..
Chiranjeevi on anger is over action
ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి సినిమా చేస్తున్నప్పుడు దాన్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలని విషయం కూడా తమకు తెలుసు కదా.. అది కూడా మీడియా నిర్దేశిస్తే తామెందుకు సినిమాలు చేయడం అంటూ సీరియస్ అయ్యాడు చిరంజీవి. అక్కడితో ఆగకుండా అనంతపురం ప్రీ రిలీజ్ వేడుకలు వర్షం పడినా కూడా తాను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో చెప్పాడు చిరు. ఒకవేళ ఆరోజు తాను మాట్లాడకుండా వెళ్ళిపోయి ఉంటే.. మీడియా ఎంత పెంట పెంట చేశారో అనే భయంతోనే అప్పటికప్పుడు స్టేజి ఎక్కి మాట్లాడాను అని.. అంతేతప్ప అందులో ఎలాంటి స్క్రిప్టు లేదు అని క్లారిటీ ఇచ్చాడు చిరంజీవి. ముందు మీడియాపై ఇన్ని విమర్శలు చేసిన ఈయన.. గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన తర్వాత అదే మీడియా నెత్తిన పెట్టుకొని చూసుకుంది అంటూ ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం చేశాడు. అప్పటికే తిట్టాల్సిన తిట్లు అన్ని తిట్టిన తర్వాత చివర్లో ఆయింట్మెంట్ రాసిన లాభం లేదు కదా అని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.