Balagam Vijaya lakshmi : “బలగం” నటి విజయలక్ష్మి కన్నీటి గాధ వీడియో వైరల్..!!
Balagam Vijaya lakshmi : కమెడియన్ కం దర్శకుడు అయిన వేణు తీసిన “బలగం” ఇటీవల విడుదలయి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణ నేపథ్యం కలిగిన కథతో వచ్చిన ఈ సినిమా ఎంతోమంది హృదయాలను దోచుకుంది. ఈ సినిమా విడుదలయ్యాక తెలంగాణ ప్రాంతంలో చాలా గ్రామాలు పూర్వం మాదిరిగా డేరాలు కట్టుకొని.. సినిమా స్పెషల్ షోలు వేసుకుని చూడటం జరిగింది. సినిమాలో నటించిన అందరికీ మంచి పేరు వచ్చింది. అయితే సినిమాలో ఒక్కోన్నటికి ఒక్కో గాధ. ఇక ఈ సినిమాలో కొమరయ్య చెల్లి పోషప్ప పాత్ర ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంది.
సినిమాలో ఓవైపు అన్న చనిపోయాడని ఏడుస్తూ… మరోవైపు అందరినీ ఓ కంట కనిపెడుతూ అవకాశం దొరికినప్పుడల్లా సూటిపోటి మాటలు మాట్లాడుతూ.. గొడవలకు కారణం అవుతూ ఉంటది. అటువంటి వైవిధ్యమైన నటనతో వెండితెరపై నట విశ్వరూపం చూపించింది నటి విజయలక్ష్మి. కానీ ఆమె నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవటం జరిగింది. అయితే సినిమాలో రాకముందు హరికథలు.. ఇంకా పలు సినిమాలలో రాణించడం జరిగిందని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు విజయలక్ష్మి. ఇంకా ఆర్థిక కష్టాలు గురించి చెప్పుకొస్తూ… భర్త చనిపోవడం జరిగిందని.
భర్త చనిపోయిన నాలుగు సంవత్సరాలకే కొడుకు కూడా చనిపోవడం జరిగిందని.. తన కన్నీటి గాథను ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపింది. ఆ తర్వాత చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ సమయంలో నా చిన్న కొడుకు భార్య కోడలు గర్భవతి. నా జీవితంలో తట్టుకోలేని విషాదం అది. కట్టుకున్న భర్త చనిపోవడం… ఆయన మరణించిన నాలుగేళ్లకు చేతికందిన కొడుకు మరణించడం.. ఎంతో బాధించింది. ఆ సంఘటన నుండి ఇంతవరకు తేలుకోలేకపోయాను. విజయలక్ష్మి లేటెస్ట్ ఇంటర్వ్యూ చూసి ఎన్నో నాటకాలు సినిమాల వేషాలు వేసి నవ్వించే ఈ నటి వెనకాల విషాదమైన గాధ ఇంత ఉందా అని నేటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
https://youtu.be/C4pEslG8-kA