Home » Entertainment » Balagam Movie Director Next Movie Update
Entertainment

Balagam : బలగం తీసిన డైరెక్టర్ ఇప్పుడు ఏం సినిమా చేస్తున్నాడో చూడండి !

Authored By
aruna
The Telugu News | Published on: July 10, 2023, 6:00 pm
Advertisement

Balagam : ఇటీవల వచ్చిన ‘ బలగం ‘ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకత్వం వహించిన జబర్దస్త్ కమెడియన్ వేణు కి మంచి గుర్తింపు దక్కింది. తెలంగాణ పల్లె నేపథ్యంలో వచ్చిన బలగం సినిమా తెలుగు ప్రేక్షకులను ఎమోషనల్ గా ఆకట్టుకుంది. ఎంచుకున్న కథను ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అవ్వడంలో వేణు సక్సెస్ అయ్యాడు. కమెడియన్ అయినా వేణు ఇంత మంచి ఎమోషనల్ సినిమా ఆడియన్స్ కి అందిస్తాడని ఎవరు అనుకోలేదు. బలగం సినిమా పెట్టిన బడ్జెట్ కి 3 రెట్లు తిరిగి వచ్చాయి. దీంతో దిల్ రాజు మరోసారి వేణుకి ఛాన్స్ ఇస్తున్నారు.

Advertisement

ఈసారి కూడా వేణు సినిమా వెంకటేశ్వర బ్యానర్ లోనే ఉంటుందని తెలుస్తుంది. బలగం సినిమా హిట్ అవ్వడంతో ఈసారి బడ్జెట్ విషయంలో దిల్ రాజు అసలు రాజు పడేది లేదట. అయితే వేణు తన నెక్స్ట్ సినిమాకి స్టార్ హీరో కావాలని అడుగుతున్నాడని టాక్. వేణు స్టార్ హీరోను అడిగితే దిల్ రాజు షాక్ అయ్యాడని వార్తలు వస్తున్నాయి. బలగం లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన తరువాత వేణు టాలెంట్ గుర్తించకపోతే ఎలా. ప్రస్తుతం చాలామంది మొదటి సినిమాతోనే కోట్ల బడ్జెట్ సినిమాలు చూస్తున్నారు.

Balagam movie director next movie update

Advertisement

అలాంటిది కమెడియన్గా సినిమాలు చేస్తూ డైరెక్టర్ గా మారి నుంచి ఎమోషనల్ సినిమా అందించిన వేణుకి అతడు అడిగిన స్టార్ హీరోని ఇవ్వడం తప్పులేదని అంటున్నారు. చిన్న బడ్జెట్ తో బలగం లాంటి సినిమా చేసిన వేణు ని ప్రోత్సాహిస్తే అధిక బడ్జెట్ తో ఇంకో ఏలాంటి సినిమా చేస్తాడో ఊహించవచ్చు. అలాంటి వేణు టాలెంటును గుర్తించకపోతే పొరపాటు అవుతుంది. దీనికి దిల్ రాజు తప్పకుండా ఛాన్స్ ఇస్తారు. మరి వేణు ఏ స్టార్ హీరోతో సినిమా చేస్తాడో చూడాలి. ఇక బలగం సినిమాకి నేషనల్ అవార్డు రావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి చూడాలి డైరెక్టర్ వేణు ఎల్డండి ఆ అవార్డు ను అందుకుంటారో లేదో చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి