Balakrishna
Balakrishna : మా ఎలక్షన్స్ వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఇటీవల ప్రకాశ్ రాజ్ వర్సస్ మంచు విష్ణు ఆనంది కాస్త మరో ముగ్గురు వచ్చి మేము కూడా మా కుర్చికోసం పోటీపడతామని తయారయ్యారు. ఎప్పుడో సెప్టెంబర్ లో ఎలక్షన్ ఉంటే ఇప్పుడే రచ్చలు మొదలయ్యాయి. తాజాగా దీని గురించి నట సింహం నందమూరి బాలకృష్ణ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారని కమిటీ సభ్యులను నిలదీశారు. నేను సూటిగా ఒకే ప్రశ్న అడుగుతున్నా అంటూ ఈ ప్రశ్నను అడిగారు.
Balakrishna About on maa association building
అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. మా భవనం కోసం అడిగితే ఒక ఎకరం ఇవ్వదా.. అంటూ బాలయ్య సూటిగా ప్రశ్నించారు. ఇక ఇదే సందర్భంగా.. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమందరం.. బహిరంగంగా చర్చించుకోవడం కరెక్ట్ కాదన్నారు. అసోసియేషన్ ఎన్నికల్లో ఆర్టిస్టులు అందరూ సమానమే అంటూ అభిప్రాయపడ్డారు. గతంలో ఫండ్ రైజింగ్ పేరుతో మా సభ్యులు అమెరికా వెళ్లిన విషయాన్ని కూడా బాలయ్య గుర్తు చేశారు. ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌లో అమెరికా వెళ్లి చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇక ‘మా’బిల్డింగ్ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకొస్తే, నేను సహకరిస్తానని చెప్పారు బాలయ్య.
Balakrishna About on maa association building
సినీ పెద్దలంతా కలిసి వస్తే.. మా బిల్డింగ్ ను ఇంద్రభవనంలా నిర్మించుకోవచ్చని బాలయ్య చెప్పుకొచ్చారు. ఈ సమయంలోనే లోకల్ నాన్ లోకల్ అంశంపై ప్రస్థావిస్తూ.. అలాంటివి తాను ఏమాత్రం పట్టించుకోనని వివరణ ఇచ్చారు. కాగా ఇటీవల హీరో మంచు విష్ణు.. ‘మా’ సొంత భవంతి నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేనే సమకూరుస్తానని ఎవరూ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని ప్రకటించాడు. దీంతో వ్యవహారం మరింత హీటెక్కింది. ఏకగ్రీవం చేయకపోతేనే నేను అధ్యక్ష పదవికి పోటీపడతానని ప్రకటించి సినీపెద్దలను గౌరవించాడు. ఇక సెప్టెంబర్ లో అసలు మా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది ప్రస్తుతానికి డైలమాగా ఉంది.
ఇది కూడా చదవండి ==> కత్తి మహేష్ బిజినెస్ డీల్.. చెరో 12.5 ఎకరాలు… షాకింగ్ డెత్ సీక్రెట్స్..!
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటిన హైపర్ ఆది.. దీపికతో మామూలు రొమాన్స్ కాదుగా ! వీడియో
ఇది కూడా చదవండి ==> ఎక్కడో కాలింది.. ఎక్స్ ప్రెస్ హరిపై అషూరెడ్డి కామెంట్స్.. వీడియో
ఇది కూడా చదవండి ==> ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బయటపెట్టిన గద్దర్
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.