R narayana murty : ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బయటపెట్టిన గద్దర్
R narayana murty: ఆర్ నారాయణమూర్తి R narayana murtyఎలాంటి చిత్రాలను తీస్తారో అందరికీ తెలిసిందే. ఆయన రూపొందించే చిత్రాలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకు వస్తాయి. చైతన్యవంతులను చేస్తాయి. అంతేకాదు ఎవరికి అదరక, బెదరక ఉద్యమాలు, ప్రభుత్వ పనితీరుపై విమర్శనాత్మకంగా సినిమాలను రూపొందించి సంచలనం సృష్టిస్తుంటారు. ఈ క్రమంలో ఆర్ నారాయణ మూర్తి తాజాగా రైతన్న అనే తాజా చిత్రం తెరకెక్కించారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గ్లోబలైజేషన్‌లో రైతులు పడుతున్న అవస్థల గురించి ప్రస్తావిస్తూ ఈ సినిమా ప్రమోషన్‌ను మొదలు పెట్టారు. తాజాగా నిర్వహించిన చిత్ర ప్రెస్ మీట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రజా గాయకుడు గద్దర్.
గ్లోబలైజేషన్ అనే పేరుతో రైతులను ఇష్టమొచ్చినట్టు దోచుకొంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా రూపొందించే చట్టాలపై నారాయణమూర్తి లాంటివారు సినిమాలను రూపొందించుకొని అసలు వాస్తవాలను బయటపెడుతున్నారు. రైతులు ఎక్కడైనా తమ పంటను అమ్ముకోవచ్చంటూ మాయ మాటలు చెప్పి దారుణంగా వాళ్లను మోసం చేస్తున్నారు. ఇక్కడ పండిస్తున్న పంటను ఢిల్లీలో అమ్ముకోవడం సాధ్యమవుతుందా అని గద్దర్ ప్రశ్నించాడు. మార్కెట్, చవకగా దొరికే శ్రామిక దేశాలు, అలాగే భారీగా లాభాలను పొందడమే లక్ష్యంగా కొన్ని కార్పోరేట్ సంస్థలు వ్యవహరిస్తున్నాయి. అలాంటి సంస్థల దోపిడి గుట్టు బయటపెట్టడానికే సినిమాను ఆర్ నారాయణ మూర్తి R narayana murty ఆయుధంగా ఎంచుకొన్నారు. ఆయన రూపొందించిన తాజా చిత్రం రైతన్న అలా తయారైందే.
R narayana murty : సిటీకి 50 కిలోమీటర్ల దూరంగా ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు.
కార్పోరేట్, రాజకీయ వ్యవస్థలపై విమర్శనాస్త్రంగా రైతన్న చిత్రం రూపొందింది. రైతులపై కార్పోరేట్ సంస్థల దండయాత్రను కళ్ళకి కట్టినట్టు చూపించారు.. అని గద్దర్ తెలిపారు. ఇదే సందర్భంగా ఆర్ నారాయణమూర్తి ఆరోగ్యం గురించి గద్దర్ వెల్లడించారు. దాదాపు ఎనిమిది నెలల నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మా ఇంటికి రమ్మని పిల్చాను. అయినా ఆయన రాలేదు. నారాయణమూర్తి R narayana murty కి సొంత ఇల్లు, ఆస్తి అంటూ ఏవీలేవు. ఎడ్డిదో.. గుడ్డిదో.. పెళ్లాం ఉండాలి. సూటు లేదు, బూటు లేదు. ఒక బండి లేదు..ఇలా ఏమీ లేకుండా జీవిస్తున్నారు. తెర మీద మాత్రమే నటిస్తాడు తప్ప జీవితంలో నటించడు.. అని గద్దర్ పేర్కొన్నారు. అంతేకాదు నారాయణమూర్తి ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాడు. ఇంటి కిరాయి కట్టలేకనే సిటీకి 50 కిలోమీటర్ల దూరంగా ఓ అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు.
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఎవ్వరూ లేరంటూ సుధీర్ కు ఫోన్ చేసిన రష్మీ.. నన్ను టార్చర్ పెట్టకు అంటూ రష్మీకి షాక్..? వీడియో
ఇది కూడా చదవండి ==> సౌందర్య, సాయి కుమార్ డబ్బంతా కొట్టేశారు.. తిండి కూడా లేక అల్లాడిపోయారు..!
ఇది కూడా చదవండి ==> అన్నపూర్ణమ్మ తన కూతురు చనిపోవడానికి కారణం ఇన్నాళ్ళకి చెప్పి కనీళ్ళు పెట్టారు
ఇది కూడా చదవండి ==> కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు.. టాలీవుడ్ హీరోలు నిజంగా అలాంటివారా..!