Kathi mahesh : కత్తి మహేష్ బిజినెస్ డీల్.. చెరో 12.5 ఎకరాలు… షాకింగ్ డెత్ సీక్రెట్స్..!
Kathi mahesh : ఇటీవల విమర్శకుడు, నటుడు కత్తి మహేష్ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణంపై రెండు మూడు రోజులుగా పలు అనుమానాలు కలుగుతూ వాటికి బలం చేకూరే వాస్తవాలు బయటపడుతున్నాయి. యాక్సిడెంట్ జరిగిన తీరు, ట్రీట్ మెంట్ జరిగిన విధానం, అనూహ్యంగా మృతి..ఇలా అన్నింటిని రక రకాల కోణాలలో విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కత్తి మహేష్ సన్నిహితులతో పాటు కత్తి మహేష్ తండ్రి ఓబులేషు..MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ తదితరులు కత్తి మహేష్ మరణంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పకడ్బంధీగా దర్యాప్తు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
దాంతో ఏపీ ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. ఇందులో భాగంగా కత్తి మహేష్‌కి యాక్సిడెంట్ అయిన సమయంలో ఆయనతో పాటు ట్రావెల్ చేస్తూ డ్రైవింగ్ సీటులో ఉన్న సురేష్ అనే వ్యక్తిని పోలీసులు విచారించారు. సురేష్ ఎవరు? కత్తి మహేష్‌కి ఇతనికి సంబంధం ఏంటి? వీళ్లిద్దరూ ఎందుకు చిత్తూరు వెళ్లాల్సి వచ్చింది?..లాంటి పలు విషయాలలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకి వచ్చాయి. సురేష్ కత్తి మహేష్ డ్రైవర్ కాదట. బిజినెస్ పార్టనర్ అని వెల్లడైంది. సురేష్ మాట్లాడుతూ.. “కత్తి మహేష్ నేను.. మైనింగ్ వ్యాపారం చేయాలని అనుకున్నాం.. అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది. నా పేరు మీద పది హెక్టార్లు, కత్తి మహేష్ పేరు మీద మరో ఐదు హెక్టార్లు మైనింగ్‌ని లీజు చేద్దాం అనుకున్నాం.
Kathi mahesh : కత్తి మహేష్ వైపు అంతగా డ్యామేజ్ కాలేదు.
చిత్తూరు జిల్లా ఉదయమాణిక్యం విలేజ్.. యర్రావారి పాలెం మండలంలో ఈ మైనింగ్ చేయాలనుకున్నాం. ఇద్దరం కలిసి 12.5 ఎకరాల్లో మైనింగ్ చేద్దాం అని ప్లాన్ చేసుకున్నాము. దానికి సంబంధించిన ఎన్ఓసీ ఇంకా రాలేదు. MRO ఆఫీస్ నుంచి ఎన్ఓసీ కోసం ఆ రోజు మేం బయలుదేరాం. ఎన్ఓసీ రావాలంటే గ్రామసభ పెట్టాలి అన్నారు. ఆ గ్రామ సభ కోసం ఎంపీడీవో గారు మమ్మల్ని పిలిచారు. ఆ గ్రామసభ కోసం మేం ఆ రాత్రి వెళ్లామని సురేష్ తెలిపాడు. అయితే యాక్సిడెంట్ అయినప్పుడు డ్రైవింగ్ నేనే చేస్తున్నాను. నావైపునే ఎక్కువ డ్యామేజ్ జరిగింది. అన్న వైపు అంతగా డ్యామేజ్ కాలేదు.
ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే.. నేను సీటు బెల్ట్ పెట్టుకుని ఉన్నాను.. ఆయన పెట్టుకోలేదు. అప్పటికే నేను రెండుసార్లు సీటు బెల్టు పెట్టుకోమని మహేష్ అన్నకి చెప్పాను. కానీ ఆయన నాకు ఇలా కంప్ర్టబుల్ గా ఉందని అన్నారు తప్ప సీటు బెల్టు పెట్టుకోలేదు. మేము వెళ్ళింది కొత్త ఇన్నోవా కారు. దాంతో 100 స్పీడు దాటిన తరువాత సీటు బెల్టు కోసం వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అప్పుడు వెనుక నుంచి సీటు బెల్ట్ పెట్టుకున్నాడు. నిద్ర వస్తుందని చెప్పడంతో వెనక్కి వెళ్లి పడుకోమని చెప్పాను.
Kathi mahesh : చనిపోయే ఛాన్స్ లేదు.
యాక్సిడెంట్ అవగానే నాసైడ్ ఉన్న డోర్ ఓపెన్ అవలేదు. కానీ కత్తి మహేష్ సైడ్ ఉన్న డోర్ మాత్రం ఓపెన్ అయ్యింది. వెంటనే హైవేపై ఉన్న పోలీసులు వచ్చారు. యాక్సిడెంట్ అయ్యాక, హాస్పటల్‌కి వెళ్లే వరకూ కూడా ఆయన సృహలోనే ఉన్నారు. చెన్నై ఆసుపత్రిలో సర్జరీలు అయ్యేవరకూ మూడు రోజులు ఆయనతోనే ఉన్నాను. కత్తి మహేష్ కోలుకున్నారు. వెంటిలేటర్ ని కూడా తీసేశారు.
చనిపోయే ఛాన్స్ లేదు. ఆయన ఫ్రెండ్ పవిత్రతో పాటు నేను కూడా అక్కడే ఉన్నాం. మూడు రోజులు తర్వాత ఐసీయూ నుంచి కిందికి కూడా షిఫ్ట్ చేశారు. ఆ సమయంలో కత్తి మహేష్ చాలా వరకు కోలుకున్నాడు. మమ్మల్ని గుర్తుపట్టడమే కాదు.వాళ్ళ మామయ్యతో కూడా మాట్లాడాడు.కానీ కత్తి మహేష్ మృతిపై చాలా అనుమానాలు కలుగుతున్నాయి. అయితే నేను చెప్పేది ఒకటే. ప్రమాదం జరిగినప్పుడు కారులో నేనే ఉన్నాను కాబట్టి, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రెండోది హాస్పటల్ కి తీసుకుని వెళ్లిన తరువాత.. ఏరోజు ఆయనకి లంగ్స్ ప్రాబ్లమ్ అని డాక్టర్స్ చెప్పలేదు. ఆఖరి రోజు లంగ్స్ ఇన్ఫెక్షన్‌తో చనిపోయారని చెప్పారు. వాళ్లు అలా చెప్పగానే మేమూ షాక్ అయ్యాం.. అంటూ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు సురేష్.
ఇది కూడా చదవండి ==> నేను మాత్రం అలా ఉండలేను.. యాంకర్ సుమ వీడియో వైరల్
ఇది కూడా చదవండి ==> హద్దులు దాటిన హైపర్ ఆది.. దీపికతో మామూలు రొమాన్స్ కాదుగా ! వీడియో
ఇది కూడా చదవండి ==> ఇంట్లో ఎవ్వరూ లేరంటూ సుధీర్ కు ఫోన్ చేసిన రష్మీ.. నన్ను టార్చర్ పెట్టకు అంటూ రష్మీకి షాక్..? వీడియో
ఇది కూడా చదవండి ==> ఆర్ నారాయణమూర్తి ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో బయటపెట్టిన గద్దర్