BalaKrishna – Prabhas : ఒకే ఫ్రేములో క‌నిపించ‌నున్న బాల‌య్య‌, ప్ర‌భాస్.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులే ఉండ‌వు..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

BalaKrishna – Prabhas : ఒకే ఫ్రేములో క‌నిపించ‌నున్న బాల‌య్య‌, ప్ర‌భాస్.. ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులే ఉండ‌వు..!

BalaKrishna – Prabhas : నంద‌మూరి బాల‌కృష్ణ ర‌చ్చ ఇప్పుడు ఏ విధంగా ఉందో మ‌నం చూస్తూనే ఉన్నాం. వెండితెర‌తో పాటు డిజిట‌ల్ ప్లాట్ ఫాంలోను తెగ సంద‌డి చేస్తున్నాడు. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 షోతో డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్న బాల‌య్య … ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులతో ఫన్‌ చిట్‌ చాట్ చేశాడు. ఈ ఎపిసోడ్స్ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచాయి. ఇక తాజా ఎపిసోడ్‌లో లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :2 December 2022,2:20 pm

BalaKrishna – Prabhas : నంద‌మూరి బాల‌కృష్ణ ర‌చ్చ ఇప్పుడు ఏ విధంగా ఉందో మ‌నం చూస్తూనే ఉన్నాం. వెండితెర‌తో పాటు డిజిట‌ల్ ప్లాట్ ఫాంలోను తెగ సంద‌డి చేస్తున్నాడు. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2 షోతో డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్న బాల‌య్య … ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులతో ఫన్‌ చిట్‌ చాట్ చేశాడు. ఈ ఎపిసోడ్స్ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా నిలిచాయి. ఇక తాజా ఎపిసోడ్‌లో లెజెండరీ డైరెక్టర్లు కోదండరామిరెడ్డి, కే రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేశ్‌బాబు, అల్లు అరవింద్‌తో సరదా చిట్‌చాట్ చేశాడు బాలకృష్ణ.

అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2లో ఇప్పటికే చంద్ర‌బాబు నాయుడు-లోకేష్‌, సిద్దు జొన్నలగడ్డ, శర్వానంద్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులకు సంబంధించిన ఎపిసోడ్స్ ప్ర‌సారం అయ్యాయి. రానున్న రోజుల‌లో ఎవ‌రెవ‌రు హాజ‌రు అవుతార‌నే ఆస‌క్తి అంద‌రిలో ఉంది. చివ‌రి ఎపిసోడ్ కి ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌స్తాడ‌ని ప్ర‌చారం న‌డుస్తుంది. ఇక యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కూడా షోలో పాల్గొన‌బోతున్న‌ట్టు టాక్. అసలు మొదటి సీజన్ లోనే డార్లింగ్ ప్రభాస్ తో బాలయ్య షో ఉండాల్సి ఉండే కానీ అది కుదరలేదు. కట్ చేస్తే రెండో సీజన్ లో ప్రభాస్ వస్తున్నాడు. బాలయ్య షోలో ప్రభాస్ వస్తే \ ఈ ఎపిసోడ్ మాత్రం బాక్స్ లు బద్ధలవ్వడం ఖాయం.

BalaKrishna and prabhas in single frame

BalaKrishna and prabhas in single frame

BalaKrishna – Prabhas : ద‌బిడి దిబిడే…!

అని అంటున్నారు.బాలయ్య ప్రశ్నల వర్షం కు డార్లింగ్ ప్రభాస్ సమాధానాలు ఎలా ఇస్తాడు అనే దారి గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక బాలకృష్ణ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్‌ గోపీచంద్ మ‌లినేనితో వీరసింహారెడ్డి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన జై బాలయ్య సాంగ్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. పక్కా పవర్‌ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనంతరం అనిల్ రావిపూడితో ఎన్‌బీకే108 సినిమా చేయనున్నాడు బాలయ్య‌

Also read

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది