balakrishna-boyapati-srinu-movie-releasing-on-may-28
Balakrishna : బాలకృష్ణ – బోయపాటి శీనుల సినిమా నుంచి నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సాలీడ్ అప్‌డేట్ వచ్చేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అని ప్రకటించారు మేకర్స్. గత మూడు నాలుగు రోజులుగా టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాలతో పాటు యంగ్ హీరోలు నటిస్తున్న సినిమాల రిలీజ్ డేట్స్ ని అధికారకంగా ప్రకటిస్తున్నారు. 2020 లో మిస్ అయిన వినోదాన్ని పదింతలు 2021 లో ఇవ్వడానికి టాలీవుడ్ దర్శక, నిర్మాతలు .. హీరోలు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే తమ సినిమాల రిలీజ్ డేట్ ని లాక్ చేసుకొని అఫీషియల్ గా ప్రకటిస్తున్నారు.
balakrishna-boyapati-srinu-movie-releasing-on-may-28
ఈ క్రమంలోనే నట సింహం నందమూరి బాలకృష్ణ కూడా తన సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించాడు. బాలయ్య వరస ఫ్లాపుల్లో ఉండగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సింహా తీసి బాలకృష్ణ కి భారీ కమర్షియల్ హిట్ ని ఇచ్చాడు. సింహా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. సింహా తో ఫాం లోకి వచ్చిన బాలయ్య వరసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ‘లెజెండ్’ సినిమాతోనూ మరోసారి బాలకృష్ణ కి భారీ హిట్ ని ఇచ్చాడు బోయపాటి శ్రీను.
ఇక ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ – పూర్ణ హీరోయిన్స్ గా నటిస్తున్నార్. రీసెంట్ గా బాలయ్య – ప్రగ్యా జైస్వాల్ మీద ఒక సాంగ్ ని షూట్ చేశారట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. వాటిలో ఒక పాత్ర అఘోర పాత్ర అని ప్రచారం సాగుతోంది. అంతేకాదు ఈ పాత్ర కోసం రెండు రకాల గెటప్పులు డిజైన్ చేసినట్టు తాజా సమాచారం. ఇక “మోనార్క్” అన్న టైటిల్ ని పరిశీలిస్తున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కాగా బాలయ్య – బోయపాటిల బీబీ3 ని మే 28 న దేశ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన బాలయ్య స్టైలిష్ లుక్ ని రిలీజ్ చేయడం విశేషం.
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
This website uses cookies.