Balakrishna : బాలయ్య ‘ నోటి దూలకి ‘ పచ్చి బూతులు తిడుతున్న అక్కినేని ఫ్యాన్స్ ..!!

Advertisement

Balakrishna : నటసింహం బాలయ్య రూటే వేరు. ఆయన ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. కోపం వస్తే ఎదుటివారు ఎలాంటి వారైనా సరే దుమ్ము దులిపేస్తారు. అయితే ఈ ముక్కు సూటితనం వల్ల ఆయన కొన్నిసార్లు వివాదంలో చిక్కుకుంటారు. తాజాగా మరోసారి అలాంటిదే జరిగింది. సంక్రాంతి కానుకగా బాలయ్య ‘ వీరసింహారెడ్డి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్ లో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అని వ్యాఖ్యలు చేశారు.

Advertisement

దీంతో అక్కినేని ఫ్యాన్స్ బాలయ్య మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. సినిమా షూటింగ్ సమయంలో నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలుపుతూ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదానికి తెర లేపాయి. బాలకృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాలో అందరూ బాగా నటించారు. వీళ్ళతో నాకు మంచి టైం పాస్ అయింది. వీళ్ళతో కూర్చొని వేద శాస్త్రాలు నాన్నగారి డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని తొక్కినేని అన్ని మాట్లాడుకునే వాళ్ళం అని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు అక్కినేని అభిమానులు బాలయ్య పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Balakrishna comments about Akkineni family
Balakrishna comments about Akkineni family

తెలుగు సినీ చరిత్రలో మీ నాన్నగారి ప్రస్థానం ఎంత గొప్పదో, ఏఎన్ఆర్ గారి కెరీర్ కూడా అంతే గొప్పగా సాగింది. వారిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉండేది. ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని ఇదేనా మీ సంస్కారం అక్కినేని అభిమానులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా బాలయ్య అక్కినేని ఫ్యామిలీని అలా అనడం కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే బాలయ్య మరోసారి తన నోటి దులతో వివాదంలో చిక్కుకున్నాడు. అందుకే మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి అంటారు పెద్దలు.

Advertisement
Advertisement