balakrishna directed to Sr Ntr
Sr Ntr : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు వెండితెరపైన మాత్రమే కాదు తెలుగు ప్రజల హృదయాల్లో ఉండిపోయిన గొప్ప నటుడు రాజకీయ నటుడు. సినీ, రాజకీయ రంగంలో ధృవ తారగా వెలుగొందిన ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. ఇక ఆయన తనయుడు బాలకృష్ణ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.సీనియర్ ఎన్టీఆర్- బాలకృష్ణ కాంబినేషన్‌లో 12 సినిమాలు తెరకెక్కాయి. ఇందులో 7 సినిమాలకు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం విశేషం.
తండ్రి ఎన్టీఆర్ మాటను బాలయ్య ఎప్పుడూ గౌరవించేవాడు. ఆయన ఏం చెప్పినా వినేవాడు. సీనియర్ ఎన్టీఆర్ సెట్‌లో ఉంటే చాలు…బాలయ్య చాలా నిశ్శబ్దంగా ఉండేవాడట. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్-బాలయ్య కాంబోలో వస్తున్న ఓ సినిమాకు ఎన్టీఆర్ బాలయ్యను డైరెక్ట్ చేయాలని చెప్పాడు. ఈ సినిమాకు బాలకష్ణ దర్శకత్వం వహించాలనుకున్నారు.
balakrishna directed to Sr Ntr
కానీ, ఆ టైంలోనే సీనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అతి తక్కువ కాలంలోనే ఫినిష్ చేయాలని షరతు పెట్టారు. దాంతో అది సాధ్యపడదని భావించారో ఏమో తెలియదు. కానీ, చివరకు సీనియర్ ఎన్టీఆరే స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పేరు ‘సామ్రాట్ అశోక్’. అయితే, అతి తక్కువ టైంలో సినిమా తీస్తే కనుక సినిమా క్వాలిటీ తగ్గిపోతుందని బాలకృష్ణ భావించారట. ఈ నేపథ్యంలోనే బాలయ్య తండ్రి సీనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాను డైరెక్ట్ చేశారు. అయితే, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.
ఈ ఫిల్మ్‌లో వాణీ విశ్వనాథ్ హీరోయిన్. కాగా, కీలక పాత్రలో మోహన్ బాబు నటించాడు. ఈ చిత్రం విడుదల కూడా చాలా ఆలస్యమైంది. ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా విడుదలయిందట. ఈ సంగతులు పక్కనబెడితే.. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 2న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్‌లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
This website uses cookies.