Sr Ntr : బాలకృష్ణ దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరో.. ఆ సినిమా ఏమిటో మీకు తెలుసా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sr Ntr : బాలకృష్ణ దర్శకత్వంలో సీనియర్ ఎన్టీఆర్ హీరో.. ఆ సినిమా ఏమిటో మీకు తెలుసా..?

 Authored By mallesh | The Telugu News | Updated on :17 November 2021,8:00 am

Sr Ntr : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు వెండితెరపైన మాత్రమే కాదు తెలుగు ప్రజల హృదయాల్లో ఉండిపోయిన గొప్ప నటుడు రాజకీయ నటుడు. సినీ, రాజకీయ రంగంలో ధృవ తారగా వెలుగొందిన ఎన్టీఆర్ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. ఇక ఆయన తనయుడు బాలకృష్ణ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.సీనియర్ ఎన్టీఆర్- బాలకృష్ణ కాంబినేషన్‌లో 12 సినిమాలు తెరకెక్కాయి. ఇందులో 7 సినిమాలకు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించడం విశేషం.

తండ్రి ఎన్టీఆర్ మాటను బాలయ్య ఎప్పుడూ గౌరవించేవాడు. ఆయన ఏం చెప్పినా వినేవాడు. సీనియర్ ఎన్టీఆర్ సెట్‌లో ఉంటే చాలు…బాలయ్య చాలా నిశ్శబ్దంగా ఉండేవాడట. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్-బాలయ్య కాంబోలో వస్తున్న ఓ సినిమాకు ఎన్టీఆర్ బాలయ్యను డైరెక్ట్ చేయాలని చెప్పాడు. ఈ సినిమాకు బాలకష్ణ దర్శకత్వం వహించాలనుకున్నారు.

balakrishna directed to Sr Ntr

balakrishna directed to Sr Ntr

Sr Ntr : తండ్రి బాటలోనే తనయుడు బాలయ్య..

కానీ, ఆ టైంలోనే సీనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ అతి తక్కువ కాలంలోనే ఫినిష్ చేయాలని షరతు పెట్టారు. దాంతో అది సాధ్యపడదని భావించారో ఏమో తెలియదు. కానీ, చివరకు సీనియర్ ఎన్టీఆరే స్వయంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా పేరు ‘సామ్రాట్ అశోక్’. అయితే, అతి తక్కువ టైంలో సినిమా తీస్తే కనుక సినిమా క్వాలిటీ తగ్గిపోతుందని బాలకృష్ణ భావించారట. ఈ నేపథ్యంలోనే బాలయ్య తండ్రి సీనియర్ ఎన్టీఆర్ ఆ సినిమాను డైరెక్ట్ చేశారు. అయితే, ఆ సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న స్థాయిలో ఆడలేదు.

ఈ ఫిల్మ్‌లో వాణీ విశ్వనాథ్ హీరోయిన్. కాగా, కీలక పాత్రలో మోహన్ బాబు నటించాడు. ఈ చిత్రం విడుదల కూడా చాలా ఆలస్యమైంది. ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా విడుదలయిందట. ఈ సంగతులు పక్కనబెడితే.. నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 2న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది