Balakrishna : నందమూరి బాలయ్య గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడం మనం చూశాం. అయితే ఎలక్షన్స్ పూర్తి కావడంతో ఇప్పుడు సినిమా షూటింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ తో బిజీ అయ్యారు.తాజాగా- గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరుఅయ్యారు. హైదరాబాద్ ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయగా, ఈ ఈవెంట్‌లో బాలయ్య స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రం ఈ నెల 31న విడుదల కాబోతుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని యూ బై ఏ సర్టిఫికేట్‌ని పొందింది. హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది.
బాలకృష్ణ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. విశ్వక్ సేన్‌తో సరదాగా మాట్లాడాడు. అన్నగా పిలిచాడు. ట్రైలర్, టీజర్ బాగుందని, గోదావరి అందాలతోపాటు మంచి ఎమోషన్ కూడా ఉందని, మంచి కిక్కించే సినిమాలా ఉందన్నారు బాలయ్య. టైటిల్ విభిన్నంగా ఉందని, సినిమాపై ఆసక్తి పెంచుతుంది, సినిమా పెద్ద విజయం సాధించాలని, సక్సెస్ మీట్‌లో తాను మరిన్ని విషయాలు మాట్లాడతానని తెలిపారు. దర్శకుడు, నిర్మాతలు, హీరోయిన్లకి అభినందనలు తెలిపారు బాలయ్య. ఆయన నట వారసుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీకి సంబంధించిన ప్లాన్ జరుగుతుంది. ఆయన విదేశాల్లో నటనలో శిక్షణ తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయానికి సంబంధించిన హింట్ ఇచ్చాడు బాలయ్య. త్వరలో మా వాడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అని తెలిపారు. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నట్టుగా తెలిపారు.
ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినా కూడా ఇప్పటికీ ఒక సినిమాలోని డైలాగ్ చెప్పాలంటే టెన్షన్ పడతానని అన్నారు. సినిమా అంటే తనకు ఫ్యాషన్ అని అన్నారు. త సినీ పరిశ్రమలో తాను కొద్దిమందితో మాత్రమే సన్నిహితంగా ఉంటానని అన్నారు. విశ్వక్ సినీ ప్రయాణాన్ని మొదటి నుంచి చూస్తున్నానని.. సినిమాకు, పాత్రకు ఎప్పటికప్పుడు కొత్తదనం తీసుకువచ్చేందుకు ట్రై చేస్తుంటాడని అన్నారు. ఎప్పుడూ కొత్తదనం ఇవ్వాలని.. ఈ విషయం తన తండ్రి నుంచి నేర్చుకున్నానని అన్నారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.