Balakrishna : బాల‌కృష్ణ పెద్ద సైకో.. సంస్కారం లేదంటూ స్టార్ డైరెక్ట‌ర్ ఫైర్..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Balakrishna : బాల‌కృష్ణ పెద్ద సైకో.. సంస్కారం లేదంటూ స్టార్ డైరెక్ట‌ర్ ఫైర్..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటుతున్నారు. త్వ‌ర‌లో ఎన్బీకే 109 చిత్రంతో అలరించున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవుట్ అండ్ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి, టాలీవుడ్ సెన్షేష‌న్ ఊర్వశి రౌటేలా క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా చాందినీ చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా […]

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  Balakrishna : బాల‌కృష్ణ పెద్ద సైకో.. సంస్కారం లేదంటూ స్టార్ డైరెక్ట‌ర్ ఫైర్..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. నంద‌మూరి తార‌క‌రామారావు న‌ట వార‌సుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి స‌త్తా చాటుతున్నారు. త్వ‌ర‌లో ఎన్బీకే 109 చిత్రంతో అలరించున్నాడు. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవుట్ అండ్ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టి, టాలీవుడ్ సెన్షేష‌న్ ఊర్వశి రౌటేలా క‌థానాయిక‌గా న‌టిస్తోండ‌గా చాందినీ చౌదరి ఓ కీలక పాత్రలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్‌ ఫోర్‌ సినిమా బ్యానర్లపై సూర్యదేవర నాగవంశి , సాయి సౌజన్య సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ రాజ‌కీయ ప్ర‌చారాల‌తో బిజీగా ఉండ‌డం వ‌ల‌న మూవీకి బ్రేక్ ప‌డిన‌ట్టు తెలుస్తుంది.

Balakrishna : బాల‌య్య పెద్ద సైకో..

అయితే హిందూపురం నుండి బాల‌య్య పోటీ చేస్తుండ‌గా, ఈ సారి హ్యాట్రిక్ కొడ‌తాడ‌ని అంటున్నారు. అయితే ఈ స‌మ‌యంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల‌య్య‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు.ఆయ‌న ఎవ‌రో కాదు కే ఎస్ రవికుమార్.. కోలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరు. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్ తో సూప‌ర్ హిట్ సినిమాలు తీసిన ఆయ‌న బాల‌య్య‌తో కూడా చిత్రం చేశారు. అయితే ఆయ‌న విశ్వ‌నాథ్‌కి అసిస్టెంట్‌గా ఉన్న స‌మ‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న గురించి తాజాగా వివ‌రించారు. బాలకృష్ణ సైకోలా మారాడని, ఓ ఘటన వ‌ల‌న బాలయ్య మీద మనసు విరిగిపోయింద‌ని కామెంట్ చేశాడు.

Balakrishna బాల‌కృష్ణ పెద్ద సైకో సంస్కారం లేదంటూ స్టార్ డైరెక్ట‌ర్ ఫైర్

#image_titleBalakrishna : బాల‌కృష్ణ పెద్ద సైకో.. సంస్కారం లేదంటూ స్టార్ డైరెక్ట‌ర్ ఫైర్..!

జనని జన్మభూమి టైటిల్ తో కే విశ్వనాథ్ బాలయ్య హీరోగా సినిమా చేశారు. ఈ సినిమాకు కే ఎస్ రవికుమార్ అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో కొందరు అభిమానులు బాలయ్యను కలిసేందుకు వచ్చారట. ఒక్కొక్కరిగా బాలయ్య పక్కన నిల్చొని ఫోటోలు దిగుతుండ‌గా, ఒక అభిమాని మాత్రం ఏకంగా ఆయ‌న భుజంపై చేయి వేసి ఫొటో దిగే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. అంతే సదరు అభిమానిని బాలయ్య తీవ్రంగా కొట్టాడట. ఆ ఘటన తర్వాత బాలయ్య మీద నాకు మనసు విరిగిపోయింది. అతడు సైకో. సంస్కారం లేనివాడు. తిరిగి ఆ వ్యక్తి నిన్ను కొడితే నీ పరువు ఉంటుందా? అని కే ఎస్ రవికుమార్ బాల‌య్య‌పై నిప్పులు చెరిగాడు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది