BalaKrishna : విశ్యవిశ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన బాలకృష్ణ ఆనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఆయనకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నందమూరి బాలకృష్ణ గతంలో అభిమానుల మీద చేయి చేసుకున్న కొన్ని వీడియోలు వైరల్ కావడంతో ఆయనను ఇతర హీరోలలో అభిమానులు ఆ విషయంలో ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ అభిమానులు పెట్టినా కొట్టినా మా బాలయ్యే అంటూ కవర్ చేసుకుంటూ ఉంటారు. బాలకృష్ణకు తాజాగా అరుదైన గౌరవం దక్కింది.
దీంతో ఫ్యాన్స్ అంతా సంబురాలు చేసుకుంటున్నారు. సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారంను బాలయ్యకు అందజేస్తున్నారని అధికారక ప్రకటన వెలువడింది.జులై నెల 30వ తేదీన రవీంద్ర భారతిలో ఈ పురస్కారంను అందజేయనున్నారని సమాచారం అందుతోంది.మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. స్టార్ హీరో బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య యాక్షన్ సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి.
పైగా ఇటీవలే విడులైన బాలయ్య పోస్టర్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ స్వర కర్తగా పనిచేస్తున్నాడు. దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళ నటుడు లాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది .మరోవైపు బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రం అనీల్ రావిపూడి స్టైల్‌లో ఉంటుందని తెలుస్తుండగా, ఇది బాలయ్య అబిమానులకి మంచి ఫీస్ట్ అందించడం ఖాయంగా కనిపిస్తుంది.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్‌డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.