BalaKrishna : బాలకృష్ణ అభిమానులు గ‌ర్వ‌ప‌డే రోజు వ‌చ్చేసింది.. ఏంటో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: July 28, 2022, 5:40 pm

BalaKrishna : విశ్య‌విశ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన బాల‌కృష్ణ ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించాడు. ఆయ‌న‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నందమూరి బాలకృష్ణ గతంలో అభిమానుల మీద చేయి చేసుకున్న కొన్ని వీడియోలు వైరల్ కావడంతో ఆయనను ఇతర హీరోలలో అభిమానులు ఆ విషయంలో ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ అభిమానులు పెట్టినా కొట్టినా మా బాలయ్యే అంటూ కవర్ చేసుకుంటూ ఉంటారు. బాల‌కృష్ణ‌కు తాజాగా అరుదైన గౌర‌వం ద‌క్కింది.

దీంతో ఫ్యాన్స్ అంతా సంబురాలు చేసుకుంటున్నారు. సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారంను బాల‌య్య‌కు అందజేస్తున్నారని అధికారక ప్రకటన వెలువడింది.జులై నెల 30వ తేదీన రవీంద్ర భారతిలో ఈ పురస్కారంను అందజేయనున్నారని సమాచారం అందుతోంది.మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. స్టార్ హీరో బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘అఖండ’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య‌ యాక్ష‌న్ సినిమా తెర‌కెక్క‌నుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

BalaKrishna rare achievement award

BalaKrishna rare achievement award

BalaKrishna : అభిమానుల ఆనందం..

పైగా ఇటీవ‌లే విడులైన బాల‌య్య పోస్ట‌ర్‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌ర కర్త‌గా పనిచేస్తున్నాడు. దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళ నటుడు లాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది .మరోవైపు బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రం అనీల్ రావిపూడి స్టైల్‌లో ఉంటుందని తెలుస్తుండ‌గా, ఇది బాల‌య్య అబిమానుల‌కి మంచి ఫీస్ట్ అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

Sam C

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp