Balakrishna : ఒకపక్క కృష్ణ డెడ్ బాడీ అక్కడే ఉండగా .. గౌతమ్ బాబు గురించి బాలయ్య బాబు అంత మాట అన్నాడా ?
Balakrishna : తెలుగులో సూపర్ డూపర్ హిట్ సినిమాలను చేసిన సూపర్ స్టార్ కృష్ణ ఇటీవల మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులంతా దుఃఖానికి గురయ్యారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మహేష్ బాబు ఆయన మృతితో విషాదంగా కనిపించారు. అంతకుముందు రోజంతా విషాదంలో ఉన్న మహేష్ బాబు ఎప్పుడైతే అక్కడకు బాలకృష్ణ వచ్చాడో అప్పుడు నవ్వారు. కృష్ణకు నివాళులు అర్పించిన బాలకృష్ణ ఆ తర్వాత కొద్ది సమయం మహేష్ బాబు తో మాట్లాడారు.
ఆ సమయంలో అక్కడ గౌతం కృష్ణ మరియు గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. మహేష్ బాబుతో బాలకృష్ణ మాట్లాడుతూ పక్కనే ఉన్న గౌతమ్ కృష్ణను చూసి మీవాడు పెద్దోడు అయ్యాడు సినిమాలకు పరిచయం చేయవచ్చుగా అన్నట్లు ఉన్నాడు. దీంతో మహేష్ బాబు మురిసిపోతు నవ్వాడు. బాధలో ఉన్న మహేష్ బాబుకు బాలకృష్ణ ఆ మాట అనడంతో నవ్వు వచ్చినట్లుగా ఆ సమయంలో మహేష్ బాబు సంతోషంగా కనిపించడం ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా అయితే అలాంటి చోట జోకులు వేయడం,
నవ్వడం లాంటివి చూస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ బాలకృష్ణ పై అభిమానులు ప్రశంసలు కురిపించారు. నిన్నటి నుంచి దుఃఖంలో ఉన్న మహేష్ బాబు నవ్వించిన బాలయ్యకు కృతజ్ఞతలు అంటూ కొందరు మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. ఎప్పటిలాగే కొందరు మాత్రం బాలయ్యకు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదా అని విమర్శిస్తున్నారు. మొత్తానికి అయితే ఆ నవ్వులు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.