Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో బాలకృష్ణ కెరియర్ లో 107వ సినిమాగా వీరసింహారెడ్డి చాలా రిచ్‌గా రూపొందింది. శృతిహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఇటీవల చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్ విషయంలో ఏపీ ప్రభుత్వంతో కొంత రభస జరిగినట్టు తెలుస్తుంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ప్రభుత్వం పర్మీషన్ ఇవ్వలేదని వెంటనే ఒక్క రోజు గ్యాప్‌తో నే వేరు ఏరియాలో ఈవెంట్ నిర్వహించాల్సి వచ్చిందని అంటున్నారు. ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ.. నిర్మాతలకు సినిమా అంటే ప్యాషన్. ఆ ప్యాషన్ తో ఈ సినిమా చేశారని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా శ్రేయాస్ మీడియాని మెచ్చుకున్నాడు. ఇంత తక్కువ టైమ్ లో ముందు అనుకున్న గ్రౌండ్స్ సరిపోదని చాలా మంది వస్తున్నారని పోలీసులు చెప్పడంతో వేదికని ఇక్కడకు మార్చడం జరిగింది. 24 గంటల వ్యవధిలో ఇంత అద్భుతమైన స్టేజ్ ని శ్రేయాస్ శ్రీనివాస్ టీమ్ కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాని అన్నారు.
ఇదే ఈవెంట్‌లో బాలకృష్ణ మూవీ ట్రైలర్ విడుదల కాగా, ఇందులో ఆశించినవన్నీ ఉన్నాయని నందమూరి అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు .అయితే ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే బాలకృష్ణ చెప్పిన డైలాగ్ పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ‘సంతకాలు పెడితే బోర్డు మీ పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అనే డైలాగ్‌తో ఈ ట్రైలర్ ముగించారు. ఏపీలోని అధికార వైసీపీ ప్రభుత్వానికి కౌంటర్‌గానే బాలకృష్ణ ఈ డైలాగ్ చెప్పినట్టు ప్రచారం జరుగుతుంది. చిరంజీవి చేయలేకపోయిన పనిని బాలయ్య తన సినిమా ద్వారా చేసి చూపించాడు అని ఆయన అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.