
samantha ruth prabhu arrives in mumbai
Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘యశోద’ మూవీ రిలీజ్‌కి కొన్ని రోజులు ముందు తాను మయోసైటిస్ అనే దీర్ఘకాలిక కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ప్రకటించి అందరిని ఆశ్చర్చపరచింది. ఆ మూవీ డబ్బింగ్ వర్క్‌ని కూడా సెలైన్ సాయంతో పూర్తి చేస్తున్న ఫొటోని సమంత షేర్ చేయడంతో అందరు అవాక్కయ్యారు. ఇక యశోద మూవీ ప్రమోషన్స్‌కి దూరంగా ఉండిపోయిన సమంత.. సక్సెస్ మీట్‌కి కూడా హాజరుకాలేదు. చాలా కాలం సినిమాలకు కూడా విరామం ఇచ్చింది సమంత.
చాలా కాలం పాటు బయట కనిపించకపోవడంతో ఆమె కెరీర్ విషయంలో రకరకాల పుకార్లు షికారు చేశాయి. వీటన్నింటిని బ్రేక్ చేస్తూ.. సినిమా షూటింగ్లో పాల్గొనేందుకు ముంబైలో అడుగుపెట్టింది. హిందీలో వరుణ్ ధావన్‌తో కలిసి ‘సియాటెల్’ అనే వెబ్ సిరీస్ చేస్తుండగా, ఇందులో హీరోయిన్ గా సమంతను తప్పించి మరొకరిని తీసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలకు సమంత చెక్ పెడుతూ, ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం ఆమె రీసెంట్‌గా ముంబై చేరుకుంది. ముంబై ఎయిర్ పోర్టులో వైట్ క్యాస్ట్యూమ్స్‌లో ఉన్న సమంతను ఫొటోలు తీసేందుకు అక్కడి ఫొటోగ్రాఫర్లు ఎగబడ్డారు అనే చెప్పాలి..
samantha ruth prabhu arrives in mumbai
చాన్నాళ్ల తర్వాత సమంతను బయట చూసిన ఆమె అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. ‘సియాటెల్’ షూటింగ్ లో పాల్గొనేందుకు ఆమె ముంబై వెళ్లినట్టు తెలుస్తుండగా, త్వరలో ఖుషీ మూవీ షూటింగ్‌లో కూడా పాల్గొననుంది. ఇక శాకుంతలం సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు సమంత హాజరు అవ్వడం ఖాయం అంటూ ఆమె అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. యూనిట్ సభ్యులు మాత్రం ఇప్పటి వరకు ఆ విషయాన్ని క్లారిటీ ఇవ్వలేదు కాని అభిమానుల తెగ ఊహించేసుకుంటున్నారు. అయితే ఈవెంట్‌కి వస్తే మాత్రం నాగ చైతన్యకు ఊహించని ఝలక్ ఇస్తుందని అంటున్నారు.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.