Balakrishna : ఇప్పటికే టాలీవుడ్ సినీ పరిశ్రమలో వారసుల హంగామా నడుస్తున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ వారసుడు ఎప్పటి నుండో వెండితెర ఆరంగేట్రం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నా కూడా ఇంతవరకు కన్‌ఫాం కాలేదు. బాలకృష్ణ మాత్రం ఈ తరం హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అఖండ చిత్రంతో ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు …ఇప్పుడు అంటున్నా ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోవడం కాస్త నిరాశ నింపుతోంది.
అప్పట్లో బాలయ్య వందో సినిమా `గౌతమీపుత్ర శాతకర్ణి`లో మోక్షజ్ఞ నటిస్తాడన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం కొరటాల శివ, క్రిష్, బోయపాటి శ్రీను, రాజమౌళి లాంటి టాప్ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.కొన్ని రోజుల క్రితం మోక్షజ్ఞ నటనలో శిక్షణతో పాటు డాన్సులు, ఫైట్లు నేర్చుకుంటున్నాడని ప్రచారం జరిగింది. కాని ప్రచారాలు ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అయితే నాని `శ్యామ్ సింగరాయ్` సినిమాకి దర్శకత్వం వహించిన రాహుల్ సంకృత్యాన్ బాలయ్య తనయుడి డెబ్యూ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.
వారాహి చలన చిత్రం బ్యానర్ పై బాలయ్యకు, రాజమౌళికి అత్యంత సన్నిహితుడు అయినా సాయి కొర్రపాటి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారట. మోక్షజ్ఞ తొలి సినిమాకు అదిరిపోయే మాస్ కథ కాకుండా, సాఫ్ట్ ప్రేమ కథ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి `ప్రేమించి చూడు` అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై ఎప్పుడు అధికారిక ప్రకటన వస్తుందా అని అందరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. . ఈ రోజుల్లో, వారసత్వం కంటే, ప్రతిభ మాత్రమే యంగ్ హీరోలకు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి మరియు బాక్సాఫీస్ వద్ద వారికి మార్కెట్‌ను సృష్టించడానికి సహాయపడుతుందని బాలయ్య బాగా నమ్ముతున్నారట.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.